పవన్ నోటి దురుసు, టీడీపీ కౌంటర్



Want create site? Find Free WordPress Themes and plugins.
నోటికి ఏది వస్తే అలా మాట్లాడుతున్నాడు పవన్ కల్యాణ్. రాజకీయాల్లో అది మంచిది కాదని ఆయనకు ఇంకా తెలయడం లేదు. వారసత్వ రాజకీయాలు మంచిది కాదని చెప్పారాయన. నిజమే. వారసత్వంగా వచ్చేవి ఏవి తీసుకోకూడదు. మరి పవన్ చేసేదేమిటి. అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి నడపలేక ఎత్తేశాడు. యువరాజ్యం అధ్యక్షుడినంటూ తెగ ప్రచారం చేసిన పవన్ ఆ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే పవన్ ఇతరులకు నీతి పాఠాలు చెబుతున్నాడు. వారసత్వంగా వచ్చే వారికి రాజకీయాలు తెలియవని చెప్పారు. 
                            వార‌స‌త్వ రాజ‌కీయాల‌ను ఉద్దేశించి ప‌వ‌న్ అన్న మాటలను సిక్కోలు ఎంపీ కింజారపు రామ్మోహన నాయుడు ఘాటుగానే తిప్పికొట్టారు. రాజ‌కీయ నాయ‌కులు వారసులు అయినంత మాత్రాన వారికి స‌త్తా లేద‌ని చెప్పడం పద్దతి కాదన్నారు యువ ఎంపీ. వార‌స‌త్వంతోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా త‌న‌కంటూ ఓ గుర్తింపు ఉంద‌ని ప్రస్తావించారు. అవ‌కాశం వ‌స్తే క‌దా మ‌న‌మేంటో నిరూపించుకుంటామని చెప్పారు.  ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్నాన‌ని చెప్పారు. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్‌పై ప‌వ‌న్ ఆరోప‌ణ‌ల‌ను ఆయ‌న కొట్టిప‌డేశారు. మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐటీ, పంచాయతీరాజ్ శాఖ పరంగా లోకేష్ రాష్ట్రంను ఎంతో అభివృద్ధి లోకి తీసుకువచ్చారని గుర్తు చేశారు. 
                              చిరంజీవి సినిమాల్లోకి రాకపోతే మీరు సినిమాలు చేసేవారా అని ప్రశ్నించారు. అది వారసత్వంగా రావచ్చా అంటూ కడిగేశారు. అంతే పవన్ వైపు నుంచి కౌంటర్ లేకపోయింది. వార‌స‌త్వ రాజ‌కీయ వ్యాఖ్య‌ల‌పై యంగ్ ఎంపీ చేసిన ఎటాక్ కు ప‌వ‌న్‌ టీమ్ గుక్క తిప్పుకోలేక పోతోంది.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*