గొర్రెల మంత్రి పేడ పిసకలేడన్న రేవంత్ రెడ్డి



Want create site? Find Free WordPress Themes and plugins.
రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ లో చేరినా ధాటి తగ్గించలేదు. మాటల దాడి మరింత పెంచారు. ఎంతగా అంటే ఆ మాటలు వింటే మంత్రులు, పాలక పార్టీ నేతలకు నిద్ర కూడ రాదు. అంతగా టార్గెట్ చేస్తున్నాడు. పార్టీ ఏదైనా నా మాటలు ఇలానే ఉంటాయని చెబుతున్నాడు. అదే సమయంలో తన ఉనికిని చాటుతున్నాడు. తాజాగా వికారాబాద్ లో మాట్లాడిన రేవంత్ రెడ్డి గొర్రెల మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ అని అన్నాడు. అంతే కాదు.. నా పీక పిస‌క‌డం నీ వ‌ల్ల కాదు. నీకు నౌక‌ర్ ఇచ్చిన కేసీఆర్ వ‌ల్ల కూడా కాద‌ని వివాదస్పద వ్యాఖ్య చేశారు. 
                          అంతటితో ఆగలేదు. న‌న్ను త‌ల‌సాని ఏం చేయ‌లేడ‌ు. నా నియోజ‌క‌వర్గం కొడంగ‌ల్‌లో పశువుల పేడ కూడా పిసుకలేవ్ అని రేవంత్ తలసాని పై మండిపడ్డాడు. నీ య‌జమాని కేసీఆర్ రెండు పెగ్గులు వేస్తే కాని లేవ‌లేడు. నాలుగు వేస్తే గాని నిల‌బ‌డ‌లేడు. నువ్వేంది నా సంగ‌తి చూసేది. నా గురించి నీ య‌జ‌మాని కేసీఆర్‌ను అడిగి తెలుసుకో అని త‌ల‌సానికి రేవంత్ గట్టి పంచ్ ఇచ్చాడు. త‌ల‌సానిని ఇంతగా టార్గెట్ చేయడం మాములు విషయం కాదు. త‌ల‌సాని నువ్వు ఏ ఊరికి ఎన్ని గొర్రెలు ఇచ్చావో ? ఏ ఊరికి ఎన్ని నిధులు తెచ్చావో ? ఎంత తిన్నావో ? లెక్క చెప్పు అని రేవంత్ అనడంతో సభ నుంచి హర్షధ్వానాలు మిన్నుముట్టాయి.
                             గతంలో కొడంగ‌ల్ గురించి ఎవ్వ‌రికి తెలిసేది కాద‌ు. కానీ ఇప్పుడు ఏ పేప‌ర్లో చూసినా, టీవీల్లో చూసినా కొడంగ‌ల్ గురించే చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయ‌ని రేవంత్ తెలిపారు. తెలంగాణ అంతా ఇప్పుడు కొడంగ‌ల్ చుట్టూనే చూస్తున్నార‌ని రేవంత్ చెప్పుకొచ్చారు. కేసీఆర్ ను ఓ ఆట ఆడుకుంటున్న రేవంత్ ఇప్పుడు మంత్రి త‌ల‌సానిని ఫుట్‌బాల్ ఆడేస్తున్నాడు. ఇది అధికార పార్టీలో పెద్ద చర్చనే రేపుతోంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*