“ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ – యుకె”  ఏడవ వార్షికోత్సవ వేడుకలు… కేసీఆర్ – దీక్షా దివస్Want create site? Find Free WordPress Themes and plugins.
 లండన్‌లో “ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ – యుకె” ఏడవ వార్షికోత్సవ వేడుకలు మరియు కేసీఆర్ – దీక్షా దివస్ ని ప్రవాస తెరాస శ్రేణులు ఘనంగా నిర్వహించారు.
         కేసీఆర్ శాంతియుత తెలంగాణ పోరాటం ప్రపంచానికే ఆదర్శమని ఎన్నారై టీఆర్ఎస్ విభాగం అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం లండన్ లో ఏర్పాటు చేసిన ‘కేసీఆర్ దీక్షా దివస్ వేడుకల’ సందర్భంగా అభిప్రాయపడ్డారు. నవంబర్ 29, 2009 నాడు కేసీఆర్ తలపెట్టిన దీక్ష, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కీలక ఘట్టంగా బావించి, ఆ రోజును దీక్ష దివస్ గా జరుపుకుంటున్నామన్నారు. సరిగ్గా ఏడుసంవత్సరాల క్రితం ‘తెలంగాణ వచ్చుడో -కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదం తో తల పెట్టిన దీక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక కీలక ఘట్టం అని పేర్కొన్నారు.
             ఉపాధ్యక్షులు అశోక్ దూసరి ‘‘తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసే క్రమంలో తన ప్రాణాలను పణంగా పెట్టి సకల జనులను ఏకం చేసి, శాంతి యుత పోరాటం తో రాష్ట్రాన్ని సాధించి పెట్టిన కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం ప్రపంచానికే ఆదర్శమని’’ తెలిపారు.
           ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి ‘‘నాడు భారత స్వాతంత్ర ఉద్యమానికి గాంధీజీ గారు ఎంచుకున్న అహింసా పద్దతిని మన తెలంగాణ గాంధీజీ – కేసీఆర్ పాటించి రాష్ట్ర సాధనోద్యమంలో ఎటువంటి హింసకు తావు లేకుండా, శాంతియుత పంధా తో ఏదైన సాధించవచ్చు అనే గొప్ప సందేశాన్ని, అటు భారత దేశ పౌరులకే కాకుండా, ప్రపంచానికే గొప్ప సందేశాన్నీ, మార్గాన్ని చూపిన గొప్ప స్పూర్తి దాత నాయకుడు మన కేసీఆర్ అని’’ ప్రశంసించారు.
             అధికార ప్రతినిధులు సృజన్ రెడ్డి చాడ, రమేష్ యెసంపల్లి ‘‘ఉద్యమ నాయకుడే నేడు సేవకుడిగా, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావడం మన అదృష్టమని, బంగారు తెలంగాణ నిర్మాణానికి అహర్నిశలూ శ్రమిస్తున్నారని. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు చేతనైతే నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని, లేకుంటే రాజకీయ విమర్శలకు ఎప్పటికప్పుడు జవాబు చెప్తామని, సరైన సందర్భంలో ప్రజలు తగిన గుణ పాఠం చెప్తారని తెలిపారు. కెసిఆర్ దీక్ష తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే చారిత్రాత్మక ఘట్టమని’’ తెలిపారు.
                చివరిగా కార్యవర్గ సభ్యులు ‘‘లండన్ నుండి కేసీఆర్ తలపెట్టిన దీక్ష నుండి నేటి వరకు వారికి మద్దతుగా ఉంటూ, చేపట్టిన కార్యక్రమాలని, ఉద్యమ జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు. కెసిఆర్ నాయకత్వాన్ని బలపర్చడం మన చారిత్రాత్మక అవసరమని, ఎన్నారై టి.అర్.యస్ సెల్ కి ఎప్పటికప్పుడు కెసిఆర్ మరియు యావత్ టి.అర్.యస్ నాయకులు ఇస్తున్న ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు తెలిపారు. కేసీఆర్ ఆదేశాల మేరకు పునర్నిర్మాణం లో కూడా వారి వెంట ఉంటామని తెలిపారు.
               అనంతరం  ఏర్పాటు చేసిన వార్షిక సమావేశంలో.. రాబోవు 2019 ఎన్నికల్లో  ఒక నిర్థిష్ట మైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, తెరాస ప్రభుత్వం చేప్పట్టిన అభివృద్ధిని, నియోజకవర్గాలుగా ప్రజలకందించిన సేవలను సంక్షిప్తంగా ప్రచురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని తీర్మానించినట్టు తెలిపారు.   
          ఆ తరువాత కేకు కట్ చేసి పరస్పరం  ఎన్నారై టి.ఆర్. యస్ యుకె వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ,వందన సమర్పణ తో కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై  టి.ఆర్.యస్ సెల్ అద్యక్షులు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షులు అశోక్ దూసరి, నవీన్ రెడ్డి, శ్రీకాంత్ పెద్దిరాజు, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైసర్ బోర్డు సభ్యులు దొంతుల వెంకట్ రెడ్డి,సెక్రటరీ లు శ్రీధర్ రావు, సృజన్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి మల్లా రెడ్డి బీరం, అధికార ప్రతినిధులు హరి గౌడ్ నవాబుపేట్, రమేష్ యెసంపల్లి, మీడియా ఇంచార్జ్ శ్రీకాంత్ జెల్ల, ఐ.టీ సెక్రటరీ వినయ్ ఆకుల,ఈస్ట్ లండన్ కో ఆర్డినేటర్ , వెల్ఫేర్ ఇంచార్జ్ రాజేష్ వర్మ, ఈవెంట్ ఇంచార్జ్ సత్యపాల్ రెడ్డి,ఈస్ట్ లండన్ ఇంచార్జ్ నవీన్ మాదిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ సభ్యులు రవి కుమార్ రత్తినేని హాజరైన  వారిలో వున్నారు
 
 
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*