మగాళ్లు సీతాకోక చిలుకలన్న రాజకుమారి



Want create site? Find Free WordPress Themes and plugins.
అమ్మాయి కనపడితే చాలు సొల్లు కార్చే వాళ్లే ఎక్కువ. అందుకే జాగ్రత్తగా ఉండాలని.. అవసరమైతే అంతు చూడాలని చెబుతోంది ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు నన్నపనేని రాజకుమారి. మగాళ్లు సీతాకోక చిలుకల్లాంటి వారు. ఆడపిల్లలు పూబంతులు. వీరిని ఆకట్టుకోవడానికి సీతాకోక చిలుకలు రంగు రంగుల ఆకర్షణలతో వస్తాయి. రక రకాల వేషాలు వేస్తాయి. అలాంటి వారి ఆకర్షణకు మహిళలు లోనుకావద్దు. మాన, ప్రాణ, ఆత్మరక్షణ కోసం అవసరమైతే అంతం చేయాలి. ఎదురుతిరగాలి. అలాగని మగాళ్లందరూ చెడ్డవారు కాదని చెప్పేసింది రాజకుమారి.
                                పిల్లలు, యువతను పెడదోవ పట్టిస్తున్న అశ్లీల వెబ్‌సైట్లు, యూ ట్యూబ్‌ల్లోని వీడియోలను కేంద్రం తొలగించాలని కోరారు. చిత్తూరు జిల్లాకు చెందిన భార్గవి, తిరుమల, నాగరత్న, నిర్మల అనే నలుగురు మహిళా కానిస్టేబుళ్లు మహిళల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు సైకిల్ యాత్ర చేస్తున్నారు. 46 రోజులుగా 1200 కిలో మీటర్ల పాటు సైకిల్‌పై తిరిగారు వాళ్లు. చిత్తూరుకు వచ్చిన వారిని నన్నపనేని రాజకుమారి అభినందించారు. ఈ సందర్భంగా నన్నపనేని ఫేస్‌బుక్, యూ ట్యూబ్, వాట్సప్‌ల పై మాట్లాడారు.
                               రోజు టీవీల్లో వచ్చే కొన్ని సీరియల్స్‌ మహిళల్ని చులకనగా చూపిస్తున్నాయి. నేర ప్రవృత్తిని రెచ్చగొట్టేలా ఉంటున్నాయి. అసభ్యంగా చూపడం వల్ల సమాజంలో మహిళల పట్ల ఎక్కువగా వేధింపులు, దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ఆడ పిల్లలు తల్లితండ్రుల కంటే ఎక్కువ సమయం ఉపాధ్యాయుల వద్దే ఉంటున్నారని ప్రస్తావించారు. అందుకే వారిని చదువులకే పరిమితం చేయకుండా సమాజం ఎలా పోతోంది, సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలనే విషయాలను సైతం నేర్పించాల్సిన బాధ్యత టీచర్లు, అధ్యాపకులపై ఉందన్నారు.
                               సమస్య వస్తే మగాళ్లను చంపేయాలని రాజకుమారి చెప్పడం ఇది రెండోసారి. గతంలోను ఆమె ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పెద్దగా వ్యతిరేకత రాలేదు గానీ… ఇలా చంపేయాలని చెప్పడం కాస్తంత ఆశ్చర్యమే.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*