పవన్ ను వదలని కత్తి మహేష్



Want create site? Find Free WordPress Themes and plugins.
కత్తి మహేష్. బిగ్ బాష్ షోలో పాల్గొన్న తర్వాత అ+తంలోనే కామెంట్ చేశాడు. అసలు అతను హీరోగాను పనికి రాడని తేల్చేశాడు. అలా అంటే ఫాన్స్ ఊరుకుంటారా.. కత్తిని చంపేస్తాం. నరికేస్తాం. ఊరుకోమని బెదిరించారు. వారించాల్సిన పవన్ కల్యాణ్ వారిని రెచ్చగొట్టేలా మాట్లాడటం కాస్తంత విచిత్రమే. అయినా సరే కత్తి తన కలం కత్తికి మరింత పదను పెడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా మరోసారి కత్తి మహేష్ స్పందించారు. పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటనను ఉద్దేశించి మాట్లాడారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలని కామెంట్ చేశాడు. ఇటు స్వామి కార్యం, అటు స్వకార్యం అని పవన్ కల్యాణ్ పర్యటన సంగతి చెప్పకనే చెప్పాడు. 
                        పోలవరానికి వైకాపా నేతలు ముందుగా పర్యటనలు ఏర్పాటు చేసుకున్నారు. వారి కంటే ముందే అక్కడకు వెళ్లిన పవన్ పోలవరం పై తనకు తెలిసిన విషయాలు మాట్లాడారు. ఇది వైకాపాను ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక పార్టీ యాత్ర పెట్టుకున్న సమయానికే మరో పార్టీ అధినేత యాత్ర పెట్టుకోవడం మంచిది కాదు. కానీ పవన్ కల్యాణ్ ఇవేం పట్టించుకోలేదు. తాను చేయదల్చుకుంది చేసేశాడు. కత్తి మహేష్ కావాలనే అతన్ని విమర్శించాడు. దీనికి ప్రముఖ నిర్మాత బన్నీ వాసు రంగంలోకి వచ్చాడు. నంది అవార్డుల పై నోరు పారేసుకున్న బన్నీ వాసు ఇప్పుడు ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టాడు. “పవన్ కల్యాణ్ ఫ్యాన్స్… మార్కెట్ లో ‘కత్తి’లు, ‘సుత్తి’లు ఉంటాయి. వాటిని పట్టించుకోద్దు” అనేది సారాంశం. కత్తి మహేష్ లాంటి వారి గురించి అసలు ఆలోచన చేయవద్దని చెప్పకనే చెప్పాడు. 
                          కీలక సమయాల్లో మౌనంగా ఉండి. అమావాస్యకో పౌర్ణమికో ఓ సారి బయటకు వచ్చి పోయే పవన్ కల్యాణ్ పై ఇప్పటికే వైకాపా శ్రేణులు విమర్శల బాణాలు ఎక్కుపెట్టింది. ఇదే సమయంలో బన్నీ వాసు ఎవరినీ పట్టించుకోవద్దని కామెంట్  చేశారు. మరి పవన్ ఫ్యాన్స్ అతని మాట వింటారో… లేక తమ దారి తమదే అంటూ కత్తి మహేష్, వైకాపా పై పంచ్ లు వేస్తారో చూడాలి.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*