కాంగ్రెస్ లక్ కు గోరీ కట్టేసిన మేధావి!



Want create site? Find Free WordPress Themes and plugins.

మణిశంకర్ అయ్యర్ అంటే ఏదో సాదాసీదా రాజకీయ నాయకుడు కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మేధావి రాజకీయ నాయకుల్లో ఒకరు. ఆయన ప్రపంచంలోని అత్యుత్తమ విద్యాసంస్థల్లో చదువుకున్న మేధావి. పార్టీలో తన మేధస్సుకు గుర్తింపు ఉన్న నాయకుడు. కానీ అలాంటి కితాబులు అన్నీ ఇప్పుడు ఎందుకూ కొరగాకుండా పోయాయి. పార్టీతో సుదీర్ఘ కాలపు అనుబంధం, హోదాలు కలిగి ఉన్న ఈ నాయకుడి ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా సస్పెండ్ చేసేశారు. ఈ మాజీ కేంద్ర మంత్రికి షోకాజు నోటీసు ఇచ్చారు. నెహ్రూ గాంధీ కుటుంబానికి ఆయన కూడా భజన పరుడే (కొన్ని సార్లు నోరు జారినప్పటికీ) కానీ.. ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఎందుకంటే.. తన నోరుజారే వైఖరితో.. ఆయన పార్టీ ఆశిస్తున్న అదృష్టానికి గోరీ కట్టేశారు.

గుజరాత్ ఎన్నికలు నిజానికి సంక్లిష్టంగానే ఉన్నాయి. ఒకటి రెండు సర్వే సంస్థలు ఏకపక్షంగా ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధిస్తోందని చెబుతోంటే.. మరికొన్ని సంస్థలు భాజపా మళ్లీ గద్దె ఎక్కుతుందని క్లియరెన్స్ ఇస్తున్నాయి. ఇలాంటి డివైడ్ టాక్ ఉన్నప్పుడు.. పోటీ గట్టిగా ఉన్నదని అనుకోవాలి. గుజరాత్ లో అదృష్టం కలిసి వస్తే.. విజయం దక్కితే దాన్ని దేశవ్యాప్తంగా ఎలా క్యాష్ చేసుకోవాలా? అని కాంగ్రెస్ ఉబలాటపడుతోంది. రాహుల్ కు పార్టీ అధ్యక్ష కిరీటం దక్కిన శుభశకునంగా ఆ విజయాన్ని అభివర్ణించుకోవాలని వారి ఉబలాటం. కానీ.. వారు ఆశిస్తున్న అదృష్టానికి మణిశంకర్ అయ్యర్ అనే మేధావి నాయకుడు గండికొట్టేసి, గోరీ కట్టేశారు.

ప్రధాని మోడీ గురించి నోటి దూకుడుతో ఆయన చేసిన వ్యాఖ్యలు భాజపాకు కలిసివచ్చాయి. మోడీ నీచజాతికి చెందిన వ్యక్తి.. అసభ్య రాజకీయాలు చేస్తున్నారు అని అయ్యర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను సమయోచితంగా మోడీ అందిపుచ్చుకున్నారు. ‘‘అవును … నేను నిమ్న కులాలకు చెందిన వాడినే’’ అని చెప్పుకుంటూనే… ‘‘ఇది యావత్ గుజరాత్ కు అవమానం ’’ అనే భావనను ఆయన ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ఖచ్చితంగా ఈ మాటలు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తాయని అనుకోవచ్చు. మణిశంకర్ అయ్యర్ తన నోటి దూకుడుతో పార్టీకి నష్టం చేయడం ఇది తొలిసారి కాదు.

2014 ఎన్నికలకు ముందు.. ‘‘21వ శతాబ్దంలో మోడీ ప్రధాని అయ్యే ఛాన్సే లేదని.. కావలిస్తే.. కాంగ్రెసు పార్టీ సభల వద్ద చాయ్ (టీ) అమ్ముకోవడానికి ఆయనకు అవకాశం ఇస్తాం’’ అని వ్యాఖ్యానించడం ద్వారా మణిశంకర్ అయ్యర్.. ‘చాయ్‌వాలా’ విమర్శలను తెరపైకి తెచ్చారు. ఆ చాయ్ వాలా అనే కామెట్లను మోడీ ఎంత సమర్థంగా వాడుకున్నారో.. తన చాయ్ వాలా బాల్యాన్ని ఎంతటి ప్రచారాస్త్రంగా మలుచుకుని విజయం సాధించారో అందరికీ తెలుసు. ఇప్పడు అలాగే.. అదే అయ్యర్.. మరో బ్రహ్మాస్త్రాన్ని గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో మోడీకి అందించినట్లుగా కనిపిస్తోంది.

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*