మ్యూజియంలో ప్రదర్శనగా యుద్ధ విమానం



Want create site? Find Free WordPress Themes and plugins.
రాష్ట్రపతి అయ్యాక రెండోసారి ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టారు రామ్ నాథ్ కోవింద్. తొలిసారి తిరుపతికి విచ్చేసిన ఆయన ఇప్పుడు అధికారిక కార్యక్రమంలో భాగంగా వైజాగ్ కు వచ్చారు. విశాఖ సాగర తీరంలో టీయూ 142 యుద్ధ విమాన మ్యూజియంను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రారంభించారు. రాష్ట్రపతితో పాటు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 29ఏళ్ల పాటు నావికాదళంలో సేవలందించింది టీయూ 142 యుద్ధ విమానం. ఇప్పుడు అది ఆర్కే బీచ్‌ రోడ్డులోని జలాంతర్గామి మ్యూజియంలో ప్రదర్శనగా ఉంచారు. ఒక యుద్ధవిమానాన్ని ప్రదర్శనశాలగా ఏర్పాటు చేయడం దేశంలో ఇదే తొలిసారి. 
                        పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఇలాంటి పని చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నావికదళ చీఫ్‌ అడ్మిరల్‌ సునీల్‌ లంబా, కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు, రాష్ట్రమంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, అయ్యన్నపాత్రుడులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శత్రుసైన్యం సాగర తీరం మీదుగా రాకుండా అడ్డుకోవడంలో టి.యు 142 యుద్ద విమానం చురుకైన పాత్ర పోషించింది. రష్యా నుంచి ఈ యుద్ద విమానాన్ని భారత్ కొనుగోలుచేసింది. శ్రీలంకలో అంతరుద్యం జరిగినప్పుడు ఈ యుద్ద విమానం కీలక పాత్ర నిర్వహించింది. ముఖ్యంగా ఐపీకేఎఫ్ లో టీయు 142 సేవలు అమోఘం. ఇప్పుడు దానిస్థానంలో రాజలి యుద్ద విమానాన్ని అందుబాటులోకి తెచ్చారు. అలాంటివి భారత సైన్యంలో చాలానే ఉన్నాయి. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*