ప్రజారాజ్యం పార్టీ పతనానికి పరకాల కారణమటWant create site? Find Free WordPress Themes and plugins.
          పరకాల ప్రభాకర్ అంటే పవన్ కల్యాణ్ కు అసలు పడదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వక పోతే పరకాల ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు పవన్. అంతే కాదు..కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హోదా గురించి ప్రస్తావించరా అని అడిగారు. ప్రజారాజ్యం పార్టీకి ద్రోహం చేసిన వారు ఎవరో తనకు తెలుసునని..వారిని వదిలి పెట్టేది లేదన్నారు పవన్. ఇందుకు పరకాల సమాధానం చెప్పారు. గుమ్మడి కాయల దొంగ ఎవరంటే భుజాలు సర్దుకున్నట్లు అయింది పరకాల పరిస్థితి. అసలు ప్రజారాజ్యం పార్టీలో పని చేయించే సంస్కృతినే లేదన్నారాయన. అలాంటి పార్టీలో పని చేయడం వల్ల తమ పరువు పోయిందని ప్రస్తావించారు. టీడీపీకి సలహాదారుగా ఉన్న ఆయనకు ఆ పార్టీ నేతలే వ్యతిరేకులుగా ఉన్నారు. తన తీరుతో అందరినీ పరకాల విసిగిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. మంత్రి యనమల రామకృష్ణుడు వంటి వారు అయితే ఏకంగా పరకాల పై సి.ఎం చంద్రబాబునాయుడుకే ఫిర్యాదు చేసేంతగా విషయం వెళ్లింది. 
         ఇప్పుడు అదే పరకాల ప్రబాకర్  పై నిప్పులు చెరిగాడు పవన్ కల్యాణ్. ముఖ్యమంత్రి కావడమే రాజకీయం కాదని, సామాజిక మార్పు తేవడమే రాజకీయమని జనసేన అధినేత అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జనసేన కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ‘సీఎం అవుతాను.. అప్పటివరకు ఆగండి పనులు చేస్తానంటే కుదరదు. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రభుత్వంతో ఎన్నో పనులు చేయించ వచ్చని జగన్  పై విమర్శలు కురిపించారు పవన్. 
        నిస్వార్థమైన వ్యక్తులు చిరంజీవికి తోడుంటే ప్రజారాజ్యం అధికారంలో ఉండేది. ప్రజలకు మంచి చేయాలనే తపన చిరంజీవికి ఉంది. ప్రత్యేక హోదాపై నేనొక్కడినే ప్రశ్నించాలా?. పరకాల ప్రభాకర్‌, నిర్మలా సీతారామన్‌ ఎందుకు దానిపై మాట్లాడటం లేదు. రాజకీయాల్లో నేనింకా చిన్న పిల్లాడిని. ప్రజారాజ్యంలో గుర్తింపు ఇవ్వలేదని చిరంజీవిపై కస్సున లేచిన పరకాల ప్రభాకర్‌.. ఇప్పుడు పాము పడగ ఎందుకు విప్పడం లేదని అడిగారు. పరకాల లాంటి కమిట్‌మెంట్‌ లేని వ్యక్తులు జనసేనలో ఉండకూడదు. సైద్ధాంతిక బలంతో జనసేన పార్టీ పెట్టినా.. బీజేపీతో జట్టు కట్టినా ఆలోచించే చేశాను. నాకు కూర్చోబెట్టి వందల కోట్లు ఇచ్చేవారు లేరు. ఇచ్చినా నేను తీసుకోను  అని పవన్‌కల్యాణ్‌ చెప్పారు. 
       ప్రజారాజ్యం పార్టీకి ద్రోహం చేసిన వారి అంతు తేలుస్తానని చెప్పారు. ఇప్పుడు ఒకరి పేరు బయట పెట్టారు పవన్. ఇంకొంత మంది పేర్లు త్వరలోనే వెల్లడించే అవకాశముంది.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.1 Comment

  1. ప్రజారాజ్యం కు పరకాల కాదు ద్రోహం చేసింది. చిరంజీవే! ఆయనకే చిత్త శుద్ధి లేదు. ఎపుడెపుడు కాంగ్రెస్ లో కలుపుదాం, మంత్రి అవుదామని యావ. నమ్మి వెంట నడిచిన కార్యకర్తలను, ఓటు వేసిన జనాలను వెఱ్ఱి పప్పాల చేసి, తను మంత్రి అయ్యాడు. కేంద్ర మంత్రిగా విభజన ఆపాడా? మెగా అభిమానులు వున్న ఆయన హోదా గురించి ఏనాడైనా మాట్లాడా, లేదా పోరాటం చేశాడా? లేదే, చక్కగా సినిమాలు చేసుకుంటున్నాడు. గురివింద సామెత లాగ, పవన్ ఆ వెఱ్ఱి బ్రాహ్మడు, బలం లేదు అనేగా. ా
    ఇన్ని చేసినా అన్నయ్యే అమాయకుడు, టిక్కెట్లు అమ్ముకున్న బావ మంచోడు.

Leave a Reply

Your email address will not be published.


*