పవన్ కల్యాణ్ కు రోజా సవాల్Want create site? Find Free WordPress Themes and plugins.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విమర్శల జోరు పెంచింది వైకాపా. అవినీతిపరుడైనందుకే జగన్ కు ఎన్నికల్లో తాను మద్దతునివ్వలేదన్నారు పవన్. తండ్రి ముఖ్యమంత్రి అయితే కొడుకు ముఖ్యమంత్రి కావాలనుకోవడం మూర్ఖత్వం అన్నారు. ప్రజలు ఓటు ద్వారా గెలిపించాలి తప్ప.. ప్రతి సమస్యకు తాను ముఖ్యమంత్రి అయితే పరిష్కరిస్తానని చెప్పడం మంచిది కాదని జగన్ ను విమర్శించారు పవన్. వేల కోట్ల రూపాయల అవినీతి చేసిన జగన్ కు తాను మద్దతు ఇవ్వక పోవడానికి కారణం అదేనని చెప్పారు. 
                              దీనికి వైకాపా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. మాటకు మాట చెప్పింది. కృష్ణానదిలో పడవ బోల్తా పడితే లండన్ లో ఎవరో విద్యార్థి చెబితే తెలిసిందట పవన్ కల్యాణ్ కు. ఈ విషయాన్ని పవన్ స్వయంగా చెప్పారు. అదే అంశాన్ని ప్రస్తావించారు వైకాపా నేత, నగరి ఎమ్మెల్యే రోజా. ఎవరో ఒకరు చెబితే తెలుసుకునే పరిస్థితిల్లో పవన్ ఉన్నారన్నారు. ఆంధ్రజ్యోతి పత్రికా కార్యాలయం గదుల్లో మంటలు వస్తే తెల్లారే పాటికి ఆయన అక్కడ వాలారు. ఆ రోజు ఎవరూ చెప్పలేదన్నారు. జేసీ దివాకర్ ట్రావెల్స్ వల్ల ఎంతో మంది చనిపోతే పవన్ ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు రోజా. ముసునూరు ఎమ్మార్వో పై చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన నాడు జనసేన ఏం చేసిందన్నారు. ముద్రగడ పద్మనాభం పై దాడి చేసినప్పుడు పవన్ ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు.  
                             అంతే కాదు దేశంలో వ్యభిచారం కూపంలోకి వెళుతున్న ఆడవారు ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ మంది ఉన్నారు. ఆ సంగతి పవన్ కు తెలియదా.. వారి మీద గౌరవం ఉంటే పవన్ స్పందించడా అని ప్రశ్నించారు. తుళ్లూరు రైతుల కష్టాలు తెలుసుకునేందుకు వచ్చి వారితో అన్నం తిని హైదరాబాద్ కు వచ్చి చల్లబడ్డారని విమర్శించారు రోజా. టీడీపీని ఏమన్నా అనే దమ్ము పవన్ కు లేదని రోజా ఎద్దేవా చేశారు. పోలవరం కాంట్రాక్టు ధరను అమాంతం పెంచిన చంద్రబాబు తీరు పవన్ కు కనపడటం లేదాయని ప్రశ్నించారు రోజా. 
                          మొత్తంగా జగన్ ను టార్గెట్ చేసిన పవన్ ను రోజా ఓ ఆటాడుకుంది. ఇందుకు పవన్ ఎలాంటి కౌంటరిస్తాడో మరి. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*