కోమటిరెడ్డికి హామీ, కేసీఆర్ పై ఫైర్



Want create site? Find Free WordPress Themes and plugins.
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు పై మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవినీతి ఆరోపణలు చేశారు. ఏఎంఆర్పీ ప్రాజెక్టు కింద మరో 15 టీఎంసీలు విడుదల చేయాలని డిమాండ్ చేసిన కోమటిరెడ్డి కేసీఆర్ పై మండి పడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కమీషన్ల వ్యవహారం బయటకొస్తుందని కేసీఆర్ భయపడుతున్నారని ఆరోపించారు. అంతే కాదు.. త్వరత్వరగా ప్రాజెక్టు పూర్తిచేసి నీళ్లు ఇవ్వాలనుకుంటున్నారని కోమటిరెడ్డి విమర్శించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే దమ్ము కేసీఆర్ కు లేదన్నారు. 
                    సత్తా ఉంటే తెలంగాణలో ఉప ఎన్నికలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌కు కోమటిరెడ్డి సవాల్ విసిరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నల్గొండ జిల్లాను చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. అందుకే రానున్న ఎన్నికల్లో కేసీఆర్ కు ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా ఓటమి రుచి చూపిస్తారని చెప్పారు. ఇటీవల కాలం వరకు దూకుడు తగ్గించిన కోమటిరెడ్డి ఇప్పుడు పాత పద్దతిలో విరుచుకుపడుతున్నారు. హైకమాండ్ నుంచి సానుకూల సంకేతాలు రావడమే ఇందుకు కారణమంటున్నారు. రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాక కోమటిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగిస్తారనే అంశం చర్చకు వస్తోంది. పి.సి.సి కాకపోయినా మరో మంచి పదవి ఇస్తారంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని తప్పించే ఆలోచన చేయడం లేదట హైకమాండ్. అదే సమయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రాధాన్యత తగ్గించే పనులు చేయరంటున్నారు. అందుకే కోమటిరెడ్డి ఫైర్ అవుతున్నారని తెలుస్తోంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*