పోలవరం పాలిటిక్స్



Want create site? Find Free WordPress Themes and plugins.
పోలవరం ప్రాజెక్టు సందర్శనకు నేతలు క్యూ కడుతున్నారు. ప్రతి సోమవారం సి.ఎం చంద్రబాబునాయుడు పోలవరం పై సమీక్ష నిర్వహిస్తున్నసంగతి తెలిసిందే. ఇప్పటికే 22 సార్లు పోలవరం సందర్శించారు చంద్రబాబు. మరోవైపు బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యేలంతా పోలవరం వెళ్లి వచ్చారు. ఇప్పుడు వైకాపా నేతల వంతు అయింది. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోలవరం వెళ్లారు. ఎవరికి వారే అక్కడ పనులను పరిశీలించి ఒక అవగాహనకు వస్తున్నారు. 
                        సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ తన అనుచరులతో కలిసి పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. రాజమహేంద్రవరం నుంచి కారులో పోలవరం చేరుకున్న పవన్‌ అక్కడి అధికారులతో మాట్లాడారు. హిల్‌ వ్యూ నుంచి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి పలు అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు సాగుతున్న తీరును ఎస్‌ఈ వి.రమేష్‌బాబు పవన్ కు వివరించారు. స్పిల్‌వే, డయా ఫ్రంవాల్‌ నిర్మాణం, ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యాం, నిర్మాణాల్లో ప్రగతిని ఇంజినీర్లు పవన్ కు వివరించారు. పోలవరం చేరుకున్న పవన్ ను సి.ఎం పవన్ అంటూ నినాదాలు చేశారు అభిమానులు. ‘సీఎం సీఎం’ అంటూ గట్టిగా అరవడంతో పవన్‌ అసంతృప్తికి గురయ్యారు. ఇక్కడకు పనిమీద వచ్చానని, అలాంటి నినాదాలు చేయొద్దని చెప్పారు. అయినా సరే వారు తమ నినాదాలు ఆపలేదు. 
                           ఇంకోవైపు వైకాపా నేతలు పోలవరం సందర్శించి టీడీపీ తీరును తప్పుపట్టారు. ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్టు ధరలను పెంచేసి సి.ఎం చంద్రబాబునాయుడు అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*