అన్న కోసం తమ్ముడు శపథం



Want create site? Find Free WordPress Themes and plugins.
అన్నయ్య చిరంజీవి. తమ్ముడు పవన్ కల్యాణ్. ప్రజారాజ్యం పార్టీ పెట్టి మధ్యలోనే జెండా పీకేశాడు చిరంజీవి. తమ్ముడు జనసేన పెట్టి జనంలోకి వెళుతున్నాడు. ఈ సందర్భంగా చిరంజీవి పై కామెంట్ చేశాడాయన. పార్టీలో పనిచేసే వారికి చిత్తశుద్ది చాలా ముఖ్యం. ప్రజారాజ్యం పార్టీతో నాకు ఆ విషయం బాగా అర్థమైంది. చిరంజీవిలాంటి పెద్ద మనిషిని కొందరు బలి పెట్టారు. పీఆర్పీ ఓటమి నాకు చాలా బాధ కలిగించింది. సీట్లు, అధికారం రాలేదనే బాధ లేదు. పీఆర్పీని దెబ్బ తీసిన వాళ్లందరూ, ప్రతి ఒక్కడూ నాకు తెలుసు. ఎవ్వరినీ మరిచిపోలేదు. గుండెల్లో, కడుపులో పెట్టుకుని ఉన్నాను. వాళ్లను కొడితే సరిపోదు. తిడితే సరిపోదు. చేసి చూపిస్తే అర్థమవుతుందన్నాడు పవన్. చెప్పుతో కొట్టినట్లు అర్థమవుతుంది వాళ్లకు! చిరంజీవికి ద్రోహం చేసిన వారందరికీ జనసేన చెప్పుతో కొట్టినట్లు చెబుతుంది. ఒక మంచి చేయాలనుకున్న మెగాస్టార్‌ను కూడా చిన్న చిన్న కీటకాలు ఎలా తినేస్తాయో… అలా చేశారు. వాళ్లు చిరంజీవికి చేసిన ద్రోహం కంటే, కొత్త మార్పు రాకుండా చేసిన ద్రోహాన్ని ఎప్పటికీ క్షమించను అన్నారు పవన్. 
                               పవన్ కల్యాణ్ పర్యటన జనసేనలో కొత్త ఉత్సాహం నింపుతోంది. బీజేపీ, టీడీపీ నేతలే టార్గెట్ గా అతని మాటలు వచ్చాయి. కంభంపాటి హరిబాబు, అవంతి శ్రీనివాస్ లను ఏకిపారేశారు. గతంలో వెంకయ్యనాయుడుపై ఆయన విరుచుకుపడేవారు. ఏపీకి ప్రత్యేకహోదా రాకపోవడానికి కారణం వెంకయ్య లాంటి వారేనని చెప్పారు. ఇప్పటికీ అదే ఆలోచనలో ఉన్నాడు పవన్. ఇప్పుడు ఆయన మోడీ, చంద్రబాబులకు వ్యతిరేకంగా పోరాడే ఆలోచన చేస్తున్నాడు. జనం వేరు. జనసేన వేరు. అభిమానం వేరు. వాస్తవం వేరు. సభలకు వచ్చిన జనం ఓట్లు వేస్తారని భావిస్తే… చిరంజీవి ఎప్పుడో అధికారంలోకి వచ్చేవారు. కానీ ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు పవన్ తీరు అలానే ఉందంటున్నారు. 
                                ప్రజారాజ్యం పార్టీ టిక్కెట్లను కోట్ల రూపాయలకు అమ్ముకుంది అల్లు అరవింద్ అనే వాదనుంది. ఆయన వల్లనే పార్టీ సగం నాశనం అయిందని.. ఆర్థికపరమైన విధానాలే ప్రజారాజ్యం పతనానికి దారి తీసిందని చెబుతారు. పవన్ కల్యాణ్ చర్యలు తీసుకోవాలంటే ముందుగా అతని సంగతి చూసి మిగతా వారి జోలికి పోవాల్సి ఉంటోంది. మెగా అభిమానుల కోసం ఏదో మాటలు చెప్పినా పవన్ కు తన స్థాయి ఏంటో తెలుసు. నేల విడిచి సాము చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. 
                                రేపు ఏపీలో పవన్ అధికారంలోకి వచ్చేంత సీన్ లేకపోయినా ప్రధాన పార్టీలో గెలుపు ఓటములను ప్రభావితం చేయవచ్చు. అందుకే పవన్ ను చూసి జాగ్రత్త పడతున్నాయి పార్టీలు.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*