రిజర్వేషన్లకు మోడీ మొండి చెయ్యి



Want create site? Find Free WordPress Themes and plugins.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబునాయుడులకు షాక్ ఇచ్చారు ప్రధాని మోడీ. తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేయగా… కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ చంద్రబాబు నాయుడు ఏపీ అసెంబ్లీలోను తీర్మానం పెట్టారు. రిజర్వేషన్లు ఏవైనా 50 శాతం మించకూడదనేది సుప్రీంకోర్టు చెబుతున్న మాట. అందుకే అంతకు మించి పెంచే ఆలోచన లేదని చెప్పారు గుజరాత్ ఎన్నికల సభలో ప్రధాని మోడీ. కాపులను బీసీల్లో చేరుస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మోడీ ఆమోదించరని అప్పుడే అర్థమైంది. కాబట్టి కాపుల రిజర్వేషన్ అంశం కాగితాలకే పరిమితమవుతుందని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్దితో ఉన్నా… కేంద్రం రాష్ట్రాలకు సహకరించడం లేదు. ఫలితంగా ఇబ్బంది పడాల్సి వస్తోంది. 
                       అసలు రిజర్వేషన్ల వ్యవస్థనే రద్దు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వస్తోంది. ఆర్థికంగా ఆదాయం పొందుతున్న వారికి రిజర్వేషన్లు కల్పిస్తున్న వైనం విమర్శలకు తావిస్తోంది. ఎన్నికల్లో ఓట్ల కోసం రాజకీయాల కోసం రిజర్వేషన్లు పెట్టడం మంచిది కాదంటున్నారు మరోవైపు మేధావులు. ఇరు రాష్ట్రాల సి.ఎం.లు రిజర్వేషన్ల అంశం బంతిని కేంద్రం కోర్టుకు పంపినా వచ్చే ప్రయోజనం లేదంటున్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*