అసెంబ్లీ పై మేయర్ గురి



Want create site? Find Free WordPress Themes and plugins.
గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ కు అవమానం జరుగుతోంది. అయినా సరే ఆయన టీఆర్ఎస్ నేతల పై పల్లెత్తు మాట అనలేదు. భాగ్యనగరానికి ఆయన ప్రధమ పౌరుడు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ హైదారాబాద్ కు వచ్చి మెట్రో రైలు ప్రారంభించినప్పుడు మేయర్ వెనుక ఉన్నాడు. కనీసం మేయర్ కు ఇవ్వాల్సిన గౌరవం దక్కలేదనే ప్రచారం వచ్చింది. అంతే కాదు.. హైదరాబాద్ లో ఘనంగా జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు ఆయనకు ఆహ్వానం లేదు. తన పాలనలో ఉన్న నగరంలో మేయర్ కే ఆహ్వానం లేకపోవడం పెద్దగా జనాలకు తెలియని వారికి ఆహ్వానం రావడం మాములు విషయం కాదు. కావాలనే మేయర్ ను అవమానించారని బీసీ సంఘాలు ఆందోళనలు చేశాయి. ఒక దశలో మేయర్ తన పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం వచ్చింది. మొత్తంగా ఆ వివాదం టీఆర్ఎస్ లో చర్చనీయాంశమైంది.  
                             అందుకే ఈ సారి రామ్మోహన్ కు అసెంబ్లీకి పోటీచేసే అవకాశం వస్తుందనే చర్చ సాగుతోంది. ఆయనకు ఉప్పల్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసే అవకాశం రావచ్చని సమాచారం. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ఆయనకు భరోసా ఇచ్చారని తెలుస్తోంది. ఉప్పల్ లో ఇన్ చార్జ్ సుభాష్ రెడ్డి నుంచి గట్టి పోటీ ఉన్నా, బొంతు రామ్మోహన్ కే టిక్కెట్ రావచ్చని చెబుతున్నారు. రెండేళ్ల ముందుగానే గెలుపు గుర్రాలను టీఆర్ఎస్ పరిశీలిస్తోంది. అందుకే హైదరాబాద్ మేయర్ కు ఆ అవకాశం రావచ్చని అంటున్నారు. సాధారణ ఎన్నికలలో నగరానికి సంబంధించి టీఆర్ఎస్ వ్యవహారాలను మంత్రి కేటీఆర్ కే అప్పగిస్తారనే కథనాలు వస్తున్నాయి. 
                              గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గులాబీ హావా మాములుగా లేదు. అందుకే కేటీఆర్ కే ఈ బాధ్యతలు అప్పగించేలా తండ్రి కేసీఆర్ వ్యూహం ఉందట. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*