ఏపీలో ఎల్ జీ కంపెనీ పెట్టుబడులు 



Want create site? Find Free WordPress Themes and plugins.
ఎల్ జీ. లైఫ్ ఈజ్ గుడ్. జీవితం ఆనందదాయకం. సుప్రసిద్ధ ఎలక్ట్రానిక్ సంస్థ పేరే ఎల్‌.జీ. ఇప్పుడా సంస్థ ప్రెసిడెంట్ సూన్‌ క్వోన్‌ తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడారు. మ్యానుఫ్యాక్చరింగ్‌, ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌, ఓఎల్‌ఈడీ, ఎల్‌ఈడీ, స్కీన్స్‌ వంటి డిస్‌ప్లే సిస్టమ్‌ తయారీ రంగంలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది ఎల్‌.జీ. ఆ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. తయారీ రంగంలో కొరియా దాటి పూర్తిస్థాయిలో మరే దేశానికి వెళ్లలేదు ఎల్ .జి సంస్థ. కానీ దక్షిణ కొరియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రతిపాదనను వారు సానుకూలంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. 
                    భారత దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. వ్యాపార అనుకూలత ఉంది. వసతి సౌకర్యాలు, రాయితీలు కలిసి వస్తాయి. అందుకే ఆ కంపెనీని రావాలని ఆహ్వానించారు చంద్రబాబు. కొరియన్ కంపెనీ కియా మోటార్స్ ఏపీలో స్థిరపడిన విధానం, ఫాక్స్ కాన్ తమిళనాడును వదిలి ఏపీకి వచ్చి 13 వేల మందితో పనిచేస్తున్న సంగతులను ముఖ్యమంత్రి ఎల్‌.జీ కంపెనీ ప్రెసిడెంట్ సూన్‌ క్వో కు చెప్పారు. 
                    భారతదేశ సగటు వృద్ధి రేటు కంటే, రెట్టింపు వృద్ధి రేటును ఏపీ సాధిస్తుందని ప్రస్తావించారు. ఏపీకి విస్తరించే ప్రతిపాదనను తమ బోర్డుతో చర్చిస్తామని ఆయన తెలిపారు. 
                     ఏపీలో స్టోరేజ్ బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్ రంగాలలో పెట్టుబడులకు తమకు ఆసక్తి ఉందని ఆ కంపెనీ ప్రెసిడెంట్ చెప్పారు. ఒకసారి ఆంధ్రప్రదేశ్ కు వచ్చి అక్కడ ఉన్న వ్యాపార అనుకూలతను పరిశీలించాలని చంద్రబాబు  కోరగా.. వారు సమ్మతించారు. ఇంత సాంకేతిక పరిజ్ఞానంతో ఒక ప్రభుత్వాధినేతను చూడటం తనను ఆశ్చర్య పరుస్తోందని ఎల్‌.జీ సంస్థ ప్రెసిడెంట్ సూన్ ప్రశంసించారు. మొత్తంగా కొరియా దేశ పర్యటన విజయవంతంగా ముగించుకున్న చంద్రబాబునాయుడు తిరిగి వచ్చారు. వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు సిద్దం కావడం విశేషం.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*