పోలవరం పై జగన్, పవన్, చంద్రబాబులు ఏమన్నారంటే…



Want create site? Find Free WordPress Themes and plugins.
పోలవరం రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. పోటీ పోటీ యాత్రలు సాగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోలవరం వెళ్లి రాగా.. వైకాపా నేతలు అదే పని చేశారు. తాము పోలవరం యాత్ర పెట్టాం కాబట్టే పవన్ కల్యాణ్ అక్కడకు వెళ్లారని చెప్పారు జగన్. టీడీపీని విమర్శించే సత్తా పవన్ కు లేదన్నారు జగన్. అంతే కాదు.. వైఎస్ కాలంలో కాంగ్రెస్ లో అక్రమాలు జరిగాయని పవన్ కల్యాణ్ అన్నారు. అదే నిజమైతే ప్రజారాజ్యం పార్టీని ఎందుకు కాంగ్రెస్ లో విలీనం చేశారో చెప్పాలన్నారు జగన్. డ్రెడ్జింగ్ ప్రైవేటీకరణ పై పార్లమెంటులో తమ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్న లేవనెత్తిన సంగతి పవన్ తెలుసుకోవాలన్నారు. తెలుగుదేశం చేసే అక్రమాలకు పవన్ కల్యాణ్ వత్తాసు పలుకుతున్నారని.. అందుకే విశ్వసనీయత కోల్పోయారని మండిపడ్డారు జగన్. పోలవరం పై పవన్ చంద్రబాబును ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ఏం అనుభవం ఉందని యువరాజ్యం అధ్యక్షుడు అయ్యారో చెప్పాలన్నారు.
                       ఇంకోవైపు కొరియా పర్యటన ముగించుకుని వచ్చిన సి.ఎం చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అనేక బహుళ జాతి సంస్థలు ముందుకొస్తున్నాయని చంద్రబాబు అన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో ఆటోమొబైల్‌ రంగం వూపందుకుంటోంది. కియో మోటార్స్‌కు చెందిన అనుబంధ సంస్థలు రాష్ట్రంలో ఏర్పాటు కానున్నాయని చంద్రబాబు చెప్పారు. 37 కంపెనీలతో కూడిన పారిశ్రామిక గ్రూపుతో ఏపీఈడీబీ లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ తీసుకుంది. దీనివల్ల రూ.3వేల కోట్ల పెట్టుబడులు, 7,171 ఉద్యోగావకాశాలు వస్తాయని చెప్పారు. ఏపీలో ‘కొరియా ఇండస్ట్రియల్‌ కాంప్లెక్స్‌’ ఏర్పాటుకానుంది. బూసన్‌లో జరిగిన బిజినెస్‌ సెమినార్‌లో మేకిన్‌ ఇండియా కొరియా సెంటర్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. ఎంవోయూలో భాగంగా బూసన్‌లో ఆంధ్రప్రదేశ్‌ సెంటర్‌ను నెలకొల్పుతామని చెప్పారు బాబు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎల్‌జీ సంస్థ ఆసక్తి చూపింది. మొత్తంగా రాష్ట్రానికి రూ.5వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని వివరించారు చంద్రబాబు.
 
పోలవరంపై తగ్గేది లేదన్న చంద్రబాబు
 
పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. అందుకే దాని పై మరింతగా దృష్టి పెట్టారు చంద్రబాబు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడారు. కొరియా నుంచే దానిపై ఫాలో అప్ చేస్తున్నారు బాబు. పోలవరం ప్రాజెక్టు పూర్తికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సి.ఎం చంద్రబాబునాయుడు. ఈ విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదన్నారు చంద్రబాబు. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ పనులు చేస్తున్నాం. ఏ విధంగా చేస్తే ప్రాజెక్టు పూర్తవుతుందో అది చేస్తామన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రతిపక్షం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పోలవరం ప్రాజెక్టు ఆగదన్నారు. పవన్‌కల్యాణ్‌ పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తుంటే, వైకాపా ఎలా అడ్డుకోవాలా అని చూస్తోందని చంద్రబాబు అన్నారు.
                            పోలవరాన్ని రాజకీయాలకు అతీతంగా చూడాలని కోరారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ కు వరం పోలవరమని చెప్పారు చంద్రబాబు. ప్రతిపక్షాలను ఢిల్లీకి తీసుకెళ్లడం వృధా అని చెప్పారు చంద్రబాబు. అవసరమైతే అఖిల పక్షాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు చంద్రబాబు
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*