జగన్, పవన్ ల మాటల యుద్దం



Want create site? Find Free WordPress Themes and plugins.
సి.ఎం కొడుకు సి.ఎం అవ్వాలని లేదు. ప్రజలు ఓటేస్తే ముఖ్యమంత్రి కావొచ్చు. కానీ బలవంతంగా ఆ పని చేయడం మంచిది కాదు. అందుకే జగన్ విఫలమయ్యారు. అవినీతి పరుడిగా జగన్ పై ముద్ర ఉంది. పాలకుడు అవినీతి పరుడు అయితే ప్రజలపై ప్రభావం ఉంటుంది. అందుకే వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు గత ఎన్నికల్లో మద్దతు ఇవ్వలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జగన్ లాంటి వ్యక్తిని సమర్థిస్తే తాను కూడా అలా అవుతానేమోనని భయం వేసింది. తండ్రి సీఎం అయితే తాను కూడా ముఖ్యమంత్రి కావాలని అనుకోవడం అవివేకం. ఇది ప్రజాస్వామ్యమా?.. రాచరికమా? అని పవన్ అన్నారు.  
                                రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి దోచుకున్న, లంచాలు తీసుకున్న వ్యక్తి అయితే మొత్తం సమాజం అలా తయారయ్యే అవకాశం ఉందని చెప్పారు. వేల కోట్ల అవినీతి చేసిన వ్యక్తి (జగన్)ని సమర్ధించాలనిపించలేదని, తనకు భయం వేసి… వైసీపీకి మద్దతు ఇవ్వలేదని పవన్ మరోసారి చెప్పారు. అంతే తప్ప జగన్‌పై తనకు ఎలాంటి ద్వేషం, వైరం లేదన్నారు పవన్. తనకు ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక లేదని, ప్రజా సేవ చేస్తానని, అవసరమైతే పాదయాత్ర చేస్తానని చెప్పారు పవన్. పాదయాత్ర చేస్తే సీఎం అవుతారా..? అని పవన్‌ సూటిగా ప్రశ్నించారు. ప్రజల క్షేమం కోరుకున్నవారే సీఎం అవుతారని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రా నేతలు దోపిడీ చేశారన్న తెలంగాణ నేతలు.. ఇప్పుడు వారికే ప్రాజెక్టుల కాంట్రాక్టులు కట్టబెట్టారని, రాజులు మారారు కానీ… రాచరికం మారలేదని పవన్‌ అన్నారు. 
                             జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ తనకు పరిచయం లేదన్నారు మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబుకు అవసరమైనప్పుడే పవన్ వస్తారని, చంద్రబాబును పవన్ విమర్శించరని జగన్ ఆరోపించారు. ప్రత్యేకహోదాపై తనది, పవన్‌ది ఒకే మాట. కానీ పవన్ కళ్యాణ్ ఇంకా చంద్రబాబు ప్రభావంలోనే ఉన్నారని చెప్పారు. చంద్రబాబు ప్రభావం నుంచి పవన్ బయటకు రావాలన్నారు. చంద్రబాబు మోసం, అన్యాయం చేస్తారనే విషయాన్ని పవన్ తెలుసుకుంటే మంచిదన్నారు. చంద్రబాబు, పవన్ కలిసి పోటీచేసే అవకాశం ఉందన్న ప్రశ్నకు జగన్ సమాధానమిచ్చాడు. ఎవరు అధికారంలోకి రావాలన్నా ప్రజలు దీవించాలని, దేవుడు ఆశీర్వదించాలని జగన్ చెప్పారు. 
                            డ్రెడ్జింగ్ ప్రైవేటీకరణ విషయంపై వైకాపా స్పందించాలని పవన్ కోరగా.. తాము ప్రజా సమస్యలపై ఎప్పుడూ స్పందిస్తూనే ఉంటామని చెప్పారు మరోవైపు జగన్ పార్టీ నేతలు.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*