డబ్బులు వసూలు చేసిన కేసు



Want create site? Find Free WordPress Themes and plugins.
         కేసీఆర్ అండ్ టీమ్ కు ఉచ్చు బిగిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పార్టీ ప్లీనరీ నిమిత్తం పలువురు వ్యక్తులు, సంస్థల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ‘గులాబీ కూలీ’పేరుతో పెద్ద మొత్తాల్లో డబ్బు వసూలు చేయడమే ఇందుకు కారణం. ఇలా చేసి అక్రమాలకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్‌ నేత, కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు పై కోర్టు విచారణకు స్వీకరించింది. అసలు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు అందిందో? లేదో? చెప్పాలని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ ఫిర్యాదు అందితే, అది ఎప్పుడు అందింది.. దానిని జనరల్‌ డైరీ (జీడీ)లో ఎప్పుడు నమోదు చేశారు.. అసలు నమోదు చేశారో? లేదో? చెప్పాలని కోరింది. ఫలితంగా ఇప్పుడు ఏసీబీ అధికారులు ఆ కేసు విషయం పై చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడింది. 
        టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా..ఆ పార్టీ నేతలకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదు పై అధికారులు చెప్పాల్సిన అవసరం వచ్చింది. కావాలనే ఏసీబీ అదికారులు ఈ కేసు విషయం పై గోప్యంగా ఉన్నారని తెలుస్తోంది. ప్రజా ప్రతినిధులుఅలా చేయడానికి వీలు లేదని కోర్టు ప్రస్తావించింది. ఒకవేళ జీడీ డైరీలో ఫిర్యాదు నమోదు చేసి ఉంటే ఆ ఫిర్యాదుపై ఏం చేశారో చెప్పాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది.ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 
          మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇలా డబ్బు వసూలు చేయడం అవినీతి కిందకే వస్తుంది రేవంత్ రెడ్డి చేస్తున్న వాదన. సీనియర్ న్యాయకోవిదులు ఈ కేసు కేసీఆర్ సర్కార్ కు ఇబ్బందిగా మారుతుందని అంచనా వేస్తున్నారు. తాను ఫిర్యాదు చేసినా ఏసీబీ అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ నేతలే కాదు..గతంలోను ప్రజా ప్రతినిధులు చాలా మంది ఇదే పని చేశారు. అయినా ఎవరూ కోర్టు గడప తొక్కలేదు. కానీ రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయనిపుణులతో మాట్లాడిన తర్వాతనే కోర్టుకు వెళ్లడం టీఆర్ఎస్ సర్కార్ ను ఇరకాటంలో పెడుతోంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*