ఈనెలలోనే అనుష్క పెళ్లి



Want create site? Find Free WordPress Themes and plugins.
టీమిండియా కెప్టెన్, ప్రముఖ క్రికెటర్ విరాట్ కొహ్లీ, బాలీవుడ్ భామ అనుష్క శర్మల వివాహం ఈనెలలోనే జరగనుంది. చాలా ఏళ్లుగా వారిద్దరూ సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆలస్యం చేయడం ఎంత మాత్రం ఇష్టం లేదనుకున్నారు. ప్రేమను పెళ్లి వరకు తీసుకెళుతున్నారు. కొహ్లీ, అనుష్క.. డిసెంబర్ 9, 10, 11 తేదీలలో.. ఏదో ఒకరోజు ఘనంగా ఇటాలియన్ హంగులతో వివాహం చేసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. శ్రీలంకతో ఈనెల 10 నుంచి జరిగే తీన్మార్ వన్డే, టీ-20 సిరీస్ లకు కొహ్లీ దూరంగా ఉంటున్నారు. అందుకే పెళ్లి వార్తలు మరింత జోరుగా వినిపిస్తున్నాయి. విరాట్ -అనుష్కల పెళ్లి ప్రోగ్రాం ఫొటోగ్రాఫర్ల ద్వారా బయటకు వచ్చింది. జనవరి మొదటి వారంలో సౌతాఫ్రికా టూర్ కు కొహ్లీ కెప్టెన్సీలో టీమిండియా వెళ్లనుంది. అందుకే వీలున్నంత తొందరగా పెళ్లి చేసుకునే ఆలోచనలో వారు ఉన్నారని తెలుస్తోంది. 
                          కోహ్లీ విఫలమైన సమయంలో అంతా అనుష్కా శర్మనే కారణమని తిట్టి పోశారు నెటిజన్లు. కానీ అతను ఇప్పుడు వరుస వెంబడి సెంచరీలు చేస్తుంటే ఒక్కరూ మాట్లాడటం లేదు.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*