తెలంగాణకు మహిళా మంత్రి…



Want create site? Find Free WordPress Themes and plugins.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ త్వరలో మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు  చేస్తున్నారు. అందులో ఒకరు కచ్చితంగా మహిళ ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. మహిళలను గౌరవించని ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ కాంగ్రెస్ తో పాటు… విపక్షాలు పెద్ద రచ్చే చేశాయి. ఇంకా చేస్తున్నాయి. అయినా సరే కేసీఆర్ తాను ఏం చేయదల్చుకుంటే అదే చేస్తాడు. దేశమంతా ఒక బాట అయితే తాను మరో బాట అంటారు. నిజాం పాలకులకు వ్యతిరేకంగా తెలంగాణ సమాజం అంతా పోరాటం చేస్తే కేసీఆర్ ఆయన్ను దేవుడు, దైవం అని సంబోధించాడు. అందుకే కేసీఆర్ అంటే ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. అది ఎంతలా అంటే మరోసారి కేసీఆర్ ప్రభుత్వం అసలు తెలంగాణలో అధికారంలోకి వస్తుందా రాదా అనే పరిస్థితి వచ్చింది. 
                            తెలంగాణ సర్కార్ లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే దిశగా కేసీఆర్ అడుగులు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ కు తొమ్మిది మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో ఎవరికి ఆ అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ లో మహిళల పై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. నిజామాబాద్ ఎంపీ కవిత ఆ దరిదాపుల్లో లేరు. మహిళలదే రాజ్యమని చెబుతున్నా ఒక్క మహిళా మంత్రిని తన కేబినెట్ లో కేసీఆర్ తీసుకోలేదని లేఖ రాసి మరీ ఇవాంకకు పంపారు కాంగ్రెస్ నేత వీహెచ్. ఫలితంగా కేసీఆర్ సర్కార్ లో కదలిక వచ్చిదంటున్నారు. 
                          సదస్సు విజయవంతంగా జరిగినా, తెలంగాణ మంత్రి వర్గంలో మహిళలు లేని పరిస్థితి కేసీఆర్ ను ఇరకాటంలో పెడుతోంది. మంత్రి కేటీఆర్ ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నాడు. ఒక మహిళను కొత్త గా మంత్రి పదవిలోకి తీసుకోవాలంటే ఇప్పుడు ఉన్న వారిలో ఒకరికి ఉద్వాసన చెబుతారట. వారిలో ఎవరు ఉంటారనేది ఆసక్తికరం. కొండా సురేఖకు మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. కానీ ఆమెను అంతగా కేసీఆర్ పరిగణనలోకి తీసుకోవడం లేదంటున్నారు. గతంలో కేసీఆర్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేయించడమే ఇందుకు కారణం.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*