బరిలోకి దిగక ముందే పందెం కోడికి అడ్డుకట్ట  



Want create site? Find Free WordPress Themes and plugins.
పందెం కోడి హీరో విశాల్ కోర్టుకు వెళ్లనున్నాడు. ఆర్కేనగర్‌ ఉపఎన్నికల బరి నుంచి విశాల్‌ ను తప్పించింది ఎన్నికల సంఘం. తొలిగా ఆయన నామినేషన్ ను తిరస్కరించింది. ఆ తర్వాత ఆందోళన చేయండంతో ఆమోదిస్తున్నట్లు చెప్పింది. చివరకు రాత్రి తిరస్కరిస్తున్నట్లు ప్రకటించేసింది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీప జయకుమార్‌ నామినేషన్ ను ఎన్నికల సంఘం పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. విశాల్‌ నామినేషన్‌ పై ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. నిరసనలతో నామినేషన్‌ మళ్లీ ఆమోదించినట్లు ప్రచారం జరిగింది. అంతే ఆనందంతో విశాల్ ట్వీట్లు చేశాడు. ఎన్నికల అధికారి నా నామినేషన్‌ ఆమోదించారని విశాల్‌ ట్వీట్‌ చేశారు. న్యాయమే గెలిచిందని చెప్పారు. ఇది పెద్దఎత్తున  ప్రచారం పొందింది. అంతే ఆ అధికారి పై తిరిగి ఒత్తిడి పెరిగింది. అర్థరాత్రి 11.30 గంటల సమయంలో విశాల్‌ నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు మళ్లీ ప్రకటించారు. 
                      సాంకేతిక కారణాలతో దీప నామినేషన్‌ను తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. నామినేషన్‌ పత్రంలో దీపన్‌, సుమతి అనే ఇద్దరి సంతకాలను ఫోర్జరీ చేయడంతో విశాల్‌ నామినేషన్‌ తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారి చెప్పడం హాట్ టాపికైంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 7వ తేదీ వరకు గడువు ఉంది. అప్పుడే అభ్యర్థుల గుర్తులపై నిర్ణయం తీసుకోనున్నారు. విశాల్ నామినేషన్ తిరస్కరణపై ఆయన తండ్రి జీకే రెడ్డి కోర్టు గడప తొక్కనున్నారు. కావాలని తన కుమారుడిని పోటీ నుంచి తప్పించేందుకు కుట్ర జరిగిందని చెప్పారాయన. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*