పాలకుల పై కన్నెర్ర చేసిన పవన్ కల్యాణ్ 



Want create site? Find Free WordPress Themes and plugins.
         విశాఖ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలువురు నేతల పై నిప్పులు చెరిగారు. ప్రజలకు సేవలు చేస్తారనే ఆలోచనతో వారికి మద్దతునిచ్చారు. ఇప్పుడు వారికి నేను ఎవరో తెలియదట. ప్రజా సమస్యల నుంచి ఎంపీలు కంభంపాటి హరిబాబు, అవంతి శ్రీనివాస్‌ తప్పించుకుని తిరుగుతున్నారు.అయినా జనసేన వదిలిపెట్టదు. ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి లేనివారికి 2019లో ఓట్లు అడిగే హక్కు లేదు. నేను బీజేపీ, టీడీపీ, ఇతర ఏ రాజకీయ పార్టీ పక్షం కాదు. నేను ప్రజల పక్షం. డీసీఐ ఉద్యోగులకు నా నైతిక మద్దతు ప్రకటిస్తున్నాని చెప్పారు. ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నించేందుకే విశాఖ వచ్చా. వారి బాధలు పంచుకునేందుకు జనసేన ఉందని ప్రస్తావించారు. 
        లాభాల బాటలో ఉన్న డ్రెడ్జింగ్‌ కార్పొరేష‌న్‌ ఆఫ్‌ ఇండియా(డీసీఐ)ను ప్రైవేటీకరించడాన్ని పవన్‌కల్యాణ్‌ తప్పు పట్టారు. విశాఖలో తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్న డీసీఐ ఉద్యోగులను పవన్‌ పరామర్శించి సంఘీభావం ప్రకటించారు. ఆత్మహత్య చేసుకున్న డీసీఐ ఉద్యోగి వెంకటేశ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ‘డీసీఐని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తే సహించేది లేదని చెప్పారు. 
        మోడీ, చంద్రబాబు నాకు బంధువులు కారు. ప్రజలే నాకు బంధువులు, స్నేహితులు. ప్రజలకు మేలు చేస్తారనే గత ఎన్నికల్లో వారికి మద్దతిచ్చాను. వ్యక్తిగత స్వార్థం కోసం కాదు. గత ఎన్నికల్లో నేను ప్రచారం చేస్తే గెలిచిన నేతలు ఇప్పుడు నేనెవరో తెలీదంటున్నారు. అయినా నేను బాధపడను. నేను ఎవరితోనూ గొడవలు పెట్టుకోను. సమస్య శాంతియుతంగా పరిష్కారం కావాలని కోరుకుంటాను. నాకు భయం లేదు. ధైర్యం ఉంది. సమస్యల నుంచి పారిపోను. బాధ్యతల నుంచి తప్పించుకోనని ప్రస్తావించారు పవన్. 
          వైజాగ్ కు వచ్చిన జనసేన అధినేత జనం ఘన స్వాగతం పలికారు. ఊహించనంత మంది ప్రజలు ఆయన చుట్టూర చేరడం చర్చనీయాంశమైంది. 
          డీసీఐ ఉద్యోగులు ఈరోజు రోడ్డెక్కారంటే అది ప్రభుత్వ వైఫల్యమేని చెప్పారు. అదే సమయంలో విపక్ష పార్టీ అధినేత జగన్‌ డీసీఐ ఉద్యోగులకు మద్దతు ప్రకటించాలని కోరారు. ఏదైనా సమస్య గురించి చెబితే నేను ముఖ్యమంత్రి అయ్యాక పరిష్కరిస్తా అనే మాటలు జగన్ నుంచి వస్తాయి. అవి నాకు నచ్చవు. నిర్మాణాత్మక రాజకీయాలు చేసేవారికి నేను మద్దతిస్తాని చెప్పారు. పదవి లేకపోయినా ప్రజా సమస్యలపై పోరాడటమే నా ధ్యేయం. దెబ్బలు తిన్నవారు ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో చూపిస్తానని ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం డీసీఐను ప్రైవేటీకరిస్తోంది. ప్రత్యేక హోదాను సాగదీస్తోంది. ఇలాగే కొనసాగితే విశాఖ స్టీల్‌, ఎయిరిండియాను కూడా పైవేటు వ్యక్తులకు అప్పగించేస్తారని ఆవేదన వ్యక్తం చేసారు పవన్. 
కులాలు, మతాలు లేని పార్టీ…
         నాది ప్రజల పార్టీ. ఈ పార్టీకి కులాలు, మతాలు ఉండవు. ప్రజా సమస్యల పరిష్కారమే పార్టీ ధ్యేయం. ప్రజలకు నష్టం కలిగించే ఏ పార్టీకి మద్దతు ఇవ్వను. 2019లో ఎన్నికలు వస్తున్నాయన్న సంగతి ప్రస్తుత ప్రభుత్వాలు మరిచిపోకూడదు. ప్రజలను పట్టించుకోకపోతే తగిన గుణపాఠం చెబుతారు. ప్రజా సమస్యల నుంచి తప్పించుకున్న ప్రతి ప్రజాప్రతినిధి సమాధానం చెప్పాల్సిన సమయం వస్తుందన్నారు పవన్. డిసిఐ సమస్యలపై ప్రధాని మోదీకి లేఖ రాసినట్లు చెప్పారాయన. డ్రెడ్జింగ్‌ కార్పొరేష‌న్‌ను ఎందుకు ప్రైవేటీకరించకూడదో వివరించాను. దానికి చెల్లించాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని లేఖలో కోరాను. సమస్యను పరిష్కరించకపోతే బీజేపీ ఓటమి విశాఖ నుంచే మొదలవుతుంది. మోదీతో నాకు వ్యక్తిగత విభేదాలు లేవు. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి సంస్కరణలపై నా అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాను. మోదీని నేను ఇప్పటివరకు ఏమీ అడగలేదు. నా తొలి డిమాండ్‌ను నెరవేరుస్తారో లేదో చూడాలని కోరారు పవన్. 
       నాకు పదవులు వద్దు. అవే కావాలనుకుంటే ఎప్పుడో వచ్చేవి. కానీ నేను ప్రజా క్షేత్రంలో ఉంటూ ప్రజల కోసమే పోరాడుతానని చెప్పారు పవన్. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*