ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు నాన్ బెయిల్ బుల్ వారెంట్



Want create site? Find Free WordPress Themes and plugins.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పరువు నష్టం కేసుతో ఇబ్బంది పడుతున్నాడు ఆంధ్రజ్యోతి దినపత్రిక మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ. ఆ కేసులో నాంపల్లి కోర్టు ఎదుట హాజరుకాలేదు. ఫలితంగా న్యాయమూర్తికి కోపం వచ్చింది. రాధాకృష్ణ చర్యలను తీవ్రంగా పరిగణించిన 17వ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఆయనకు నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ (ఎన్‌బీడబ్ల్యూ) జారీ చేసింది. అనారోగ్యం వల్ల కోర్టుకు రాలేకపోయారని ఆయన తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం పక్కన పెట్టింది. ఇది చాలా చిన్న కేసు అని రాధాకృష్ణ తరఫు న్యాయవాదులు చేసిన వాదనను తప్పు పట్టింది. 
                     న్యాయమూర్తులు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది కోర్టు. అందుకే ఆర్కే పై వారంట్‌ జారీ చేసింది. ఈ కేసులో పబ్లిషర్, ఎడిటర్‌తో పాటు ఇతర ఉద్యోగులు కోర్టు ఎదుట హాజరయ్యారు. వారి హాజరును నమోదు చేసుకున్న కోర్టు ఒక్కొక్కరు రూ.5 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. 
అసలేం జరిగిందంటే…
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, కరువు అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలిశారు. కానీ వారి మధ్య జరిగిన సంభాషణ అది కాదని ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. ఫలితంగా ఆ పత్రిక పై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పరువు నష్టం కేసు వేశారు. రాధాకృష్ణతో పాటు ఇందుకు బాధ్యులైన వారి పై చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, పబ్లిషర్, ఎడిటర్, మరో నలుగురు ఉద్యోగులు హాజరు కావాల్సి ఉంది. ఈ ఆదేశాలపై రాధాకృష్ణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. హైకోర్టు వీరి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే విషయంలో ఆదేశాలు ఇవ్వలేదు. అయినా సరే ఆర్కే కోర్టుకు రాలేదు.  
                       దీంతో న్యాయమూర్తి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఈ నెల 26కి విచారణను వాయిదా వేశారు. ఈ కేసు విచారణకు రాగానే.. రాధాకృష్ణకు అనారోగ్యంగా ఉంది. అందుకే కోర్టుకు హాజరుకాలేకపోతున్నారని ఆయన తరఫు న్యాయవాది చెప్పారు. ఈ మేరకు ఓ పిటిషన్‌ను న్యాయమూర్తికి ఇచ్చారు. దాన్ని పరిశీలించిన న్యాయమూర్తి డాక్టర్‌ సర్టిఫికెట్‌ లేదని అడిగారు. ఇది చాలా చిన్న కేసు అని, ఎండీ హోదా లోని వారికి ఈ కేసు వర్తించదని రాధాకృష్ణ తరఫు న్యాయవాది చెప్పారు. కేసు విచారణ సమయంలో చెప్పుకోవాలని న్యాయమూర్తి కాస్తంత గట్టిగా చెప్పారు. తాము హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశామని చెప్పారు. హైకోర్టు స్టే ఉత్తర్వులు లేనప్పుడు జ్యుడీషియల్‌ ఉత్తర్వులు అమలులో ఉంటాయని చెప్పారు. ఫలితంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాధాకృష్ణ తీరు చర్చనీయాంశమైంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*