విద్యార్థులను అణిచి వేస్తున్న కేసీఆర్ సర్కార్



Want create site? Find Free WordPress Themes and plugins.
యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదు. అందులోను విద్యార్థులతో పెట్టుకుంటే అంతే సంగతులు. తెలంగాణ వచ్చిందంటే కీలక భూమిక విద్యార్థులదే. ఉస్మానియా యూనివర్సిటీలోనే తెలంగాణ మలి ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. అంతగా విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక సి.ఎం కేసీఆర్ ఉస్మానియా విద్యార్థులను వేధించడం ఇప్పుడు హాట్ టాపికైంది. కొలువుల కోట్లాట సభకు వెళ్లకుండా వారిని అడ్డుకోవడమే కాదు.. లాఠీలతో కొట్టడం వివాదానికి దారి తీసింది.
                      కొందరు ఉస్మానియా విద్యార్దులను అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. వారిని  కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. ఓయు విద్యార్థి మురళీ ఆత్మహత్య నేపథ్యంలో జరిగిన గొడవను ప్రభుత్వం తనకు అనుకూలంగా మార్చుకునే పని చేసింది. పలువురు విద్యార్దులను పోలీసులు నిర్భంధించారు. వారితో పాటు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ను జైలుకు తరలించారు. పి.సి.సి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ఆ పార్టీ నేతలు జీవన్‌రెడ్డి, గీతారెడ్డి చంచల్‌గూడ జైలుకు వెళ్లి బాధితులను పరామర్శించారు. పోలీసులు తమ పట్ల దారుణంగా వ్యవహరించారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులను అరెస్టు చేయడాన్ని వారిని చంచల్ గూడ జైలుకు తరలించడాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు.
                           ప్రజా సంఘాలు ఈ విషయంలో కేసీఆర్ తీరును తప్పుపట్టాయి. ఉద్యమం చేసే సమయంలో వారు అండగా నిలిచిన సంగతిని గుర్తు పెట్టుకోవాలన్నారు
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*