టీడీపీ వైపు కన్నా చూపు



Want create site? Find Free WordPress Themes and plugins.
         ఆంధ్రుల నగరి అమరావతి రాజధాని శంఖుస్థాపనకు వచ్చిన ప్రధాని మోడీ గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్లు తీసుకువచ్చారు. ఇంకేముంది హస్తిన నుంచి వచ్చిన పెద్ద మనిషి అమరావతిని ఆదుకుంటారని అంతా అనుకున్నారు. సీన్ రివర్స్ అయింది. ఆదుకోవడమే కాదు. విభజన హామీలను అమలు చేయడంలేదు. అసలు సి.ఎం చంద్రబాబునాయుడుకే అపాయింట్ మెంట్ ఇవ్వడంలేదు. తన కంటే ఎక్కువగా విదేశాలకు వెళ్లిన బాబు వేల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకువస్తున్నాడు. అది నచ్చలేదనుకుంటా. అడుగడుగునా చంద్రబాబు సర్కారు కు బీజేపీ ప్రభుత్వం అడ్డుతగులుతోంది. ప్రత్యేక హోదా మొదలు కొని పోలవరం వరకు ఆటంకాలు కలిగిస్తోంది. ఫలితంగా బేజీపీ నేతలకు ఇబ్బందిగా మారింది. 
          కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందనే సామెతను గుర్తు చేసుకుంటున్నారు ఏపీ కమలం నేతలు. పైకి అనలేక లోపల ఉంచుకోలేక తల్లడిల్లుతున్నారు. వారిలో ఒకరు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. బీజేపీ తీరు చూసి ఆయన ఆ పార్టీలో ఉండలేక పోతున్నారట. ప్రత్యామ్నయం కోసం ఎదురు చూస్తున్నాడు. 
        ఒకటా..రెండా 25 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్నాడు. పెదకూరపాడు నుంచి నాలుగు సార్లు, గుంటూరు పశ్చిమ నుంచి మరోసారి ఆయన గెలిచాడు. యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రిగా ప్రస్తానం ప్రారంభించి..వ్యవసాయశాఖ మంత్రిగాను పని చేశాడు. మాజీ ముఖ్యమంత్రులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో సభ్యుడుగా కొనసాగాడు. గుంటూరు జిల్లాలో తనదైన శైలిలో చక్రం తిప్పాడు. తెలుగుదేశం పార్టీఅన్నా…చంద్రబాబు అన్నా ఒంటి కాలి మీద లేస్తాడు. ఏపీలో కాంగ్రెస్ కు సీన్ లేకపోవడంతో కమలం పార్టీలో చేరాల్సి వచ్చింది. అక్కడా కన్నాకు సరైన గుర్తింపు లేదు. ఫలితంగా అసంతృప్తికి గురవుతున్నాడట.
          కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు రాజకీయంగా అంత క్రియాశీలకంగా లేరు. అందుకే గుంటూరు వెస్ట్ ను వదిలి పెట్టి పెదకూరపాడుకు వచ్చే ఆలోచన చేస్తున్నారు. పొత్తులో భాగంగా పెదకూరపాడును బీజేపీకి కేటాయించాలని ఆయన కోరుతున్నాడు. ఇంకోవైపు పెదకూరపాడును వదిలి వెళ్లేందుకు కొమ్మాలపాటి శ్రీధర్ సిద్దంగా లేరు. అయినా కన్నా తన ప్రయత్నాన్ని విరమించుకోవడం లేదు. రెండున్నర దశాబ్దాల పాటు గుంటూరు జిల్లా రాజకీయ రాజ్యం ఏలిన తాను ఇలా బతకాల్సి వస్తుందని కుమిలిపోతున్నారట కన్నా. రాజకీయ నేతలకు పదవి లేకపోతే పిచ్చి పట్టినట్లు ఉంటుంది. ఇప్పుడు కన్నా పరిస్థితి అలానే ఉందట. ఏలాగైనా తాను తిరిగి గెలవాలని కలలు గంటున్నారు కన్నా. అందుకే కలిసి వచ్చే ఎలాంటి అవకాశాన్ని వదులుకోవడం లేదు. అందుకే టీడీపీలో చేరే ఆలోచన చేస్తున్నారట. ఇందుకు చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మరి. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*