రాహుల్ కు బాధ్యతల తర్వాత టీ. కాంగ్రెస్ ప్రక్షాళన



Want create site? Find Free WordPress Themes and plugins.
తెలంగాణ కాంగ్రెస్ ను ప్రక్షాళన చేయనుంది ఆ పార్టీ హైకమాండ్. పాత వారిని కొందరిని తొలగించి మరికొందరిని చేర్చనుంది. ఏఐసిసి అధ్యక్షుడుగా రాహుల్ గాందీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగే మొదటి ప్రక్రియ ఇదేనంటున్నారు. పి.సి.సి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని  కొనసాగవచ్చనే చర్చ సాగుతోంది. ఉత్తమ్ ను తొలగించాలనే డిమాండ్ ఉన్నా… రాహుల్ ఒప్పుకోవడం లేదట. అంతేకాదు… కాంగ్రెస్ ఇన్ చార్జ్ కుంతియా, మరో నేత కొప్పుల రాజులు ఉత్తమ్ కు అనుకూలంగా ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అండదండలు ఆయనకు ఉన్నాయి. అదే సమయంలో జైపాల్ రెడ్డిని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోకి తీసుకునే అవకాశముంది. ఇక సీనియర్ నేతలు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్యలలో ఒకరికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవి రావచ్చని అంచనా.
                           తెలంగాణలో అధికారం దక్కించుకునేందుకు కాంగ్రెస్ తన శక్తియుక్తులను ప్రదర్శించనుంది. అందుకే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయనుంది. పార్టీలో సీనియర్లకు చోటు కల్పిచనుంది. సామాజిక సమతుల్యత పాటించనుంది. పొన్నాల లక్ష్మయ్య, సర్వే సత్యనారాయణ వంటి వారికి కూడా జాతీయ స్థాయిలో అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. వి.హెచ్, మధు యాష్కీ, చిన్నారెడ్డి వంటివారికి ఏఐసీసీలో స్థానముంది.
                           సినీ నటి, మాజీ ఎంపీ ఎం.విజయశాంతికి ఏఐసీసీలో చోటు కల్పిస్తారంటున్నారు. కోమటిరెడ్డి సోదరులకు అవకాశం కల్పించే దిశగా కసరత్తు సాగుతోంది. కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డికి పీసీసీలో కీలక అవకాశాన్ని కల్పిస్తారని తెలుస్తోంది.
                       ఎన్నికల సమయంలో పీసీసీ ఎన్నికల కమిటీ పని చేయనుంది. పార్టీ నేతల అభిప్రాయాలను ఆ వేదికగా చెప్పే వీలుంది. అంతా ఇప్పుడు రాహుల్ బాధ్యతలు ఎప్పుడు తీసుకుంటారా అని ఎదురు చూస్తున్నారు.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*