టోరొంటో తెలుగు సంఘం కొత్త పాలక వర్గం



Want create site? Find Free WordPress Themes and plugins.
తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టోరొంటో కొత్త పాలక వర్గం ఎన్నికైంది. క్రిస్ గిబ్సన్ రీ క్రియేషన్ సెంటర్ బ్రాంమ్టన్ లో జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కెనడా, టోరొంటోలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల వ్యాప్తికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సమావేశంలో చర్చించారు. సంఘం కార్యదర్శి కోటేశ్వరరావు పోలవరపు అధితులను వేదిక పై ఆహ్వానించడంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు సుమన్ కె. సంవత్సరాంతపు నివేదికను వివరించారు. ఏడాది కాలంలో చేసిన పనులతో పాటు.. అందించిన సేవలను గుర్తు చేశారు. గ్రేటర్ టోరొంటో ప్రాంతంలో తెలుగు కమ్యూనిటీకి అందించిన సేవలను ప్రస్తావించారు. సంస్థలో భాగమైన ఎగ్జిక్యూటివ్ సభ్యులు, ట్రస్టీస్, స్పానర్స్ ను అభినందించారు. ఏడాది కాలంలో తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టోరొంటోను ముందుకు తీసుకెళ్లేందుకు వారిచ్చిన సలహాలు, సూచనలు, సేవలను తెలిపారు. అందుకే మరింత బలంగా అసోసియేషన్ తయారైందని చెప్పారు. 
                    మాజీ కార్యదర్శి రాజేష్ వి 2016 సంవత్సరానికి సంబంధించిన సంగతులను ప్రస్తావించగా.. సభ్యులు ఆమోదించారు. సంస్థలో ఉన్న నిధులు, వాటి జమ, ఖర్చుల గురించి బోర్డు ఆఫ్ ట్రస్టీస్ ఛైర్మన్ శ్రీనివాస్ గాడిపల్లి వివరించారు. అదే సమయంలో మాజీ కార్యదర్శి రాజేష్ వి 2016 జమ, ఖర్చులకు సంబంధించిన వివరాలను సమావేశంలో ప్రస్తావించగా.. దాని పై చర్చించిన కమిటీ ఆమోదం తెలిపింది. సంస్థ ట్రైజరర్ దేవి చౌదరి 2017కు చెందిన తాజా లెక్కల వివరాలను అందరికీ వివరించారు. అధ్యక్షులు సుమన్ కలాసబైలు, కార్యదర్శి కోటేశ్వరరావు పోలవరపు, ట్రెజరర్ దేవి చౌదరిలు కొత్త కమిటీకి ఘన స్వాగతం పలికారు. వారిని అభినందించారు. 
నూతన కమిటీ
కొత్త కమిటీని ఎన్నుకునేందుకు ఎన్నికల అధికారిగా జగన్ పి వ్యవహరించగా.. ఎగ్జిక్యూటివ్ కమిటీ, ట్రస్టీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2018 ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇలా ఉంది. 
1. రాజేష్ విస్సా, అధ్యక్షులు
2. కోటేశ్వరరావు పోలవరపు, సెక్రటరీ
3. దేవి చౌదరి, ట్రస్టీ
4. మోహన్ భట్టు, డైరెక్టర్
5. తిరుమల కుమార్ బత్తిని, డైరెక్టర్
6. నారాయణ గుడిపాటి, డైరెక్టర్
7. కార్తీక్ కళ్యాణ రామన్, డైరెక్టర్
8. మైత్రీ చౌదరి, యంగ్ డైరెక్టర్, 
9. సత్యవీర్ పోలవరపు, యంగ్ డైెరెక్టర్ r
                       తమకు సేవ చేసే అవకాశం కల్పించిన సభ్యులందరికీ ఎన్నికైన వారు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు సమాజానికి సేవలందించే అవకాశం కల్పించిన అందరికీ పేరు పేరును ధన్యవాదాలు తెలిపారు. బోర్డు ఆఫ్ ట్రస్టీ సూర్య బెజవాడ, మనోహర్ పాములలు ఈ సమావేశంలో పాల్గొని తమ ఆలోచనలను పంచుకున్నారు. తెలుగు కల్చరల్ అలసోసియేషన్ మరింతగా తమ సేవలను అందించాలని వారు కోరారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*