చలిలో సెగలు పుటిస్తున్న ప్రియాంక



Want create site? Find Free WordPress Themes and plugins.
మాజీ మిస్ వరల్డ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. ఇప్పుడామె హాలీవుడ్ లో తన హవా కొనసాగిస్తోంది. అమెరికన్ టీవీ సిరీస్ ‘క్యాంటికో’ షూటింగ్ తో బిజీ బిజీగా గడుపుతోంది. అందుకేనేమో ప్రియాంక కుర్రకారుకి వేడి సెగలు పుట్టిస్తుంది. క్వాంటికో సిరీస్ లో భాగంగా హాట్ హాట్ సుందరి మరింతగా ఒగలు పోయింది. సరికొత్త లుక్ లో కనపడుతోంది. కుర్రకారు మతులు పోగొట్టేలా ఉన్న ప్రియాంక తాజా ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాలీవుడ్ లో నటిస్తున్న సమయంలో ఓ మోస్తరు అందాలను ప్రదర్శించింది ప్రియాంక. ప్రధాని మోడీని కలిసినప్పుడే కురస దుస్తులు ధరించి అందాల హోయలు పోయింది.
                             అలాంటి అమ్మాయి హాలీవుడ్ లో అడుగు పెడితే ఆగుతుందా… ఓ రేంజ్ లో అందాలను ప్రదర్శిస్తోంది. కనపడీ కనపడనట్లు అందాల విందు చేస్తున్న తీరు కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రా నటించిన తొలి హాలీవుడ్‌ చిత్రం ‘బేవాచ్‌ లోను ఇలానే అందార ఆరా బోసింది. బేవాచ్‌ షూటింగ్‌ను బాగా ఎంజాయ్‌ చేశాను. సహచర నటులు నాతో చాలా బాగా కలిసిపోయారు. నా పాత్ర కోసం ఎంతో కష్టపడ్డాను. బేవాచ్‌ని బాగా ఎంజాయ్‌ చేయవచ్చు. కానీ సినిమాకు మీ పిల్లల్ని మాత్రం తీసుకెళ్లకండి’ అని గతంలోనే తెలిపింది ప్రియాంక. ఇందులో ప్రియాంక విక్టోరియా లీడ్స్‌ అనే విలన్‌ పాత్రలో నటించి మెప్పించింది. అప్పుడు మియామీ బీచ్ లో సందడి చేసింది ప్రియాంక.
                              అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సిగరెట్, సెక్స్ లో దేనికి ప్రాధాన్యం ఇస్తారని ప్రియాంకను అడిగారు యాంకర్. అందుకు సమాధానం చెప్పిన ప్రియాంక తనకు ఒకసారి సిగరెట్ తాగడం కంటే సెక్స్ నే బాగా ఎంజాయ్ చేస్తానని చెప్పింది. అదేంటి ప్రియాంకకు పెళ్లి కూడ కాలేదు. సెక్స్ గురించి ఎందుకు చెబుతుందంటే.. పొగరాయుళ్ల దృష్టిని మరిల్చేందుకేనని ప్రస్తావిస్తోంది. అమెరికాలోని క్వాంటికో సీరియల్లో నటించిన ప్రియాంకా అక్కడి కల్చర్ కు అలవాటు పడిందంటున్నారు. అందుకే సెక్స్ గురించి ఇంత ఓపెన్ గా మాట్లాడుతుందని చెబుతున్నారు.
                         ప్రియాంక ఏం చేసినా తప్పు లేదంటున్నారు యూత్. అంతగా క్రేజ్ సంపాదించుకుంది ఆ భామ.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*