తెలుగు సినిమాలో హీరోయిన్ గా సన్నీలియోన్…



Want create site? Find Free WordPress Themes and plugins.
సన్నీలియోన్. ఈ పేరు పలికితేనే కుర్రకారు గుండెల్లో అలజడి రేగుతోంది. యూ ట్యూబ్ లో ఆమె గురించి ఎక్కువగా షేర్స్ చేస్తున్నారు. గతంలో సన్నీలియోన్ శృంగారాన్ని ఒలకబోయించడమే ఇందుకు కారణం. శృంగార తార‌గా ప్రపంచ స్థాయి గుర్తింపు సంపాదించిన సన్నీ చూపు బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌ సినిమాల పై పడింది. ఐటమ్ సాంగ్స్‌లో హాట్ హాట్ అందాలతో అదరగొట్టేస్తుంది. యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ నటించిన గరుడవేగ మూవీలోనూ డియో.. డియో డిసక…డిసక.. అంటూ ఐటమ్ బాంబ్ పేల్చింది. ఆ పాట ఎంతగా పాపులర్ అయిందో తెలియంది కాదు… తెలుగులోనూ ఫుల్ ఫాలోయింగ్ సంపాదించిన సన్నీ హీరోయిన్ గా పూర్తిస్థాయి తెలుగు సినిమా చేయనుంది.
                               సౌత్ ఇండియన్ కల్చర్స్ బ్యాక్ డ్రాప్ తో చారిత్రాత్మక యుద్ధ నేపథ్యంలో తెరకెక్కనున్న సినిమాలో సన్నీలియోన్ హీరోయిన్ గా చేయనుంది. నవదీప్, నాజర్ లు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించనున్నారు. ఈ మూవీ కోసం కత్తి సాము, గుర్రపు స్వారీతోపాటు.. యుద్ధ సన్నివేశాల కోసం ప్రత్యేక శిక్షణ తీసుకోనుంది సన్నీ. ముంబైలో ప్రముఖ ట్రైనర్ ఒకరు సన్నీలియోన్ కు శిక్షణ ఇవ్వనున్నాడట. భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్న ఈ సినిమా కోసం డైరెక్టర్ అండ్ టీంకు సన్నీలియోన్ 150 రోజుల కాల్సీట్లను ఇచ్చినట్లు సమాచారం. 
                            బాహుబలి, 2.0 సినిమాలకు గ్రాఫిక్స్ వర్క్ చేసిన సంస్థలు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. ఈ చిత్రంలో దాదాపు 70 నిమిషాలపాటు గ్రాఫిక్స్ ఉంటాయని సమాచారం. తెలుగు, తమిళం, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ మూవీ రూపొందనుంది. ఈ మూవీ టైటిల్ ను త్వరలోనే వెల్లడించనున్నారు. వి.సి.వడివుడయన్ దర్శకత్వంలో స్టీవ్స్ కార్నర్ పతాకంపై పోన్స్ స్టిఫెన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2018 ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 
                           నటుడు మంచు మోహన్ బాబుతో కలిసి నటించాలని ఉందనే కోరిక తీర్చుకోవాలని తెగ ఉబలాడపడుతోంది సన్నీలియోన్. మరి ఆ సమయం ఎప్పుడు వస్తుందో మరి.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*