నాగశౌర్య నూతన చిత్రం ప్రారంభం



Want create site? Find Free WordPress Themes and plugins.
యువ కథానాయకుడు నాగశౌర్య నూతన చిత్రం ప్రారంభమయింది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ క్లాప్ నిచ్చారు. ప్రముఖ దర్శకుడు మారుతి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అలాగే ఈ ఇరువురు చిత్రం స్క్రిప్ట్ ను ఈ సినిమా దర్శక, నిర్మాతలకు అందచేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి, వి.ఐ.ఆనంద్, ఉపేంద్రలు ఈ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. 
          నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ మన్యం ప్రొడక్షన్స్ తమ తొలి ప్రయత్నంగా నాగశౌర్య కథానాయకుడుగా, ఛాయాగ్రాహకుడు సాయి శ్రీరామ్ ను దర్శకునిగా పరిచయం చేస్తూ ఈ చిత్రంను నిర్మిస్తోంది. ‘మేం వయసుకు వచ్చాం, అలా ఎలా, సుప్రీం, పిల్ల జమిందార్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ప్రస్తుతం నాగ శౌర్య ‘ఛలో’ చిత్రాలకు శ్రీరామ్ ఛాయాగ్రాహకునిగా పనిచేశారు. దర్శకుడు సాయి శ్రీరామ్ చెప్పిన కథలోని నవ్యత, చిత్ర కథనం ఎంతగానో నచ్చి ఈ చిత్రం ను నిర్మిస్తున్నట్లు నిర్మాత యం.విజయకుమార్ తెలిపారు. నాగ శౌర్య నటించిన చిత్రాలలో ఈ ప్రేమ కథా చిత్రం నిస్సందేహంగా వైవిధ్యాన్ని సంతరించుకుని ఉంటుందని, చిత్ర నాయిక ఎవరన్నదానితోపాటు ఇతర తారాగణం వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు. 2018, జనవరి నెల ప్రథమార్ధంలో చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు.  
         ఈ చిత్రానికి సంగీతం రధన్, కథ విద్యాసాగర్ రాజు, మాటలు విశ్వ నేత్ర, డి.ఓ.పి హరిప్రసాద్ జాస్తి, ఆర్ట్ రామాంజనేయులు, ఎడిటర్ ప్రవీణ్ పూడిలు అందించనున్నారు.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*