అమరావతిలో ప్ర‌పంచ పారిశ్రామికవేత్త‌ల స‌ద‌స్సుWant create site? Find Free WordPress Themes and plugins.
పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ఔత్సాహికులు  
ఆంధ్రుల నగరి అమరావతిలో ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు-2017( గ్లోబల్ ఎంటర్ ప్రిన్యూర్స్ సమ్మిట్) జరిగింది. ప్రవాసాంధ్రులకు సేవలందిస్తోంది ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు అసోసియేషన్ (ఏపీఎన్ఆర్టీ). ఈ మహా సదస్సుకు ఏపీఎన్ఆర్టీ నేతృత్వం వహించగా.. ఆ సంస్థ డైరెక్టర్ కానూరి శేషు బాబు ఆంధ్రప్రదేశ్ గురించి వివరించారు. నవ్యాంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, లాభాలు, భవిష్యత్ ఎలా ఉండనుంది.. ప్రభుత్వం అందిస్తున్న సేవలు, వసతి, సౌకర్యాలు, సౌలభ్యాలు, రాయితీల గురించి విడమరిచి చెప్పారాయన. అంతే కాదు.. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనువైన పరిస్థితులను తెలిపారు. 
                    సన్ రైజింగ్ స్టేట్ గా ప్రసిద్ది కెక్కిన ఆంధ్రప్రదేశ్ కు పారిశ్రామిక వేత్తలు క్యూ కడుతున్న వైనాన్ని ఏపీఎన్ఆర్టీ అంకెలతో సహా చూపించింది. ఇక్కడ పెట్టుబడులు పెడితే లాభాలు తప్ప నష్టాలు అనే మాట ఉండదని ప్రస్తావించారు. సి.ఎం చంద్రబాబునాయుడు నాయకత్వంలో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు, అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై పారిశ్రామిక వేత్తలు ఒక అవగాహనకు వచ్చారు. 
సదస్సుకు హాజరైన 35 దేశాల ప్రతినిధులు…
అంతే కాదు.. 35 దేశాల నుంచి వచ్చిన పారిశ్రామిక వేత్తలు తమ అనుభవాలను పంచుకున్నారు. కజికిస్థాన్, అమెరికా, కిర్కిస్థాన్, వెస్ట్ ఆఫ్రికా, బుర్ కిన్ పాసో, బెనిన్, నైజీరియా, కెనడా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాల వారు ఎక్కువగా ఈ సదస్సుకు విచ్చేశారు. వారిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు 15 ఏళ్ల యువ పారిశ్రామిక వేత్త రెహాన్ కెమలోవ. ఆమె స్వయంగా తయారుచేసిన రెయిన్ ఎనర్జీ జనరేటర్ గురించి ఈ సదస్సులో ప్రస్తావించారు. దానికి సంబంధించిన వివరాలను సభ్యులందరికీ తెలిపారు. చిన్న జనరేటర్ వల్ల 20 వాల్ట్ ల విద్యుత్ ను ఎలా ఉత్పత్తి చేయవచ్చునో చేసి చూపించారు. ఎలాంటి ఖర్చు లేకుండా నాలుగు ఎల్ ఈడి బల్బులు వెలిగే సామర్థం ఉన్న జనరేటర్ ను చూపించి ఆకట్టుకున్నారు. గృహ అవసరాలను తీర్చేందుకు ఇది దోహదం చేస్తుందని ప్రస్తావించారు. 
ఆంధ్రుల నగరిలో పెట్టుబడుల వరద
ఆమెనే కాదు… టర్కీకి చెందిన మరో యువ పారిశ్రామిక వేత్త డాక్టర్ లీయెలా టాగ్జిడ్ మొబైల్ టెలీ హెల్త్ అప్లికేషన్ కు సంబంధించిన విశేషాలను సభ్యులతో పంచుకున్నారు. ఇలాంటివి అభివృద్ధిలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కు బాగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని భవిష్యత్ తరాలకు బాగా ఉపయోగపడేలా దీన్ని తీర్చిదిద్దినట్లు వారు ప్రస్తావించారు. అమెరికాకు చెందిన కంభాలదిన్ని నిషిత క్విక్ కనెక్ట్ మార్కెట్ ప్లేసెస్ గురించి వివరించారు. యుఎస్ లోని వర్జీనియాకు చెందిన జోస్లిన్ నానా వేరుశెనగ, జీడిపప్పు మరియు సముద్ర ఉత్పత్తుల దిగుమతులపై పశ్చిమ ఆఫ్రికాలో ఉన్న పరిస్థితులను వివరించారు. మహిళా సాధికారికతకు సంభంధించిన అంశాలు, అవకాశాలను వివరించారు కజికిస్థాన్ కు చెందిన జెన్నీ జీనిష్ కిజ్జీ. క్లినకల్ డేటా అనాలసిస్ కు సంబంధించి డాక్టర్ మైకెల్ వివరించిన అంశాలకు ప్రశంసల జల్లు కురిపించారు సభ్యులు. సోలార్ వాటర్ పంపు ఉపయోగాలు, ప్రయోజనాలు, రైతులకు అవి ఎలా ఉపయోగపడుతున్నాయి. పెద్దగా ఖర్చు లేకుండా ఆంధ్రప్రదేశ్ రైతులు ఎలా వాటర్ పంపులను ఉపయోగపడతాయో వివరించారు అమెరికాకు చెందిన కాటీ టేలర్ అనే పారిశ్రామిక వేత్త. తద్వారా మంచి ఉత్పత్తులను రైతులు సాధించవచ్చని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీరింగ్ కంపెనీలు, వాటి ఉత్పత్పులను నార్త్ వెస్ట్రన్ ఆఫ్రికాలో మార్కెటింగ్ చేసుకునేందుకు ఉండే వెసులుబాటును రువాండాకు చెందిన థెరిస్సా సీకమా వివరించారు.
                       ఇంటెలిజెంట్ కేన్సర్ స్క్రీనింగ్ మరియు డయాగ్నాస్టిక్ సొల్యూషన్స్ అంశాల పై ఆంధ్రప్రదేశ్ కు అవసరమైన అంశాలను ప్రవీణ్ మిశ్రా, జయశ్రీ తేలుకుంట్లలు అందరికీ అర్థమయ్యేలా చెప్పిన తీరు ఆక్టటుకుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సౌత్ కరోలినా ప్రభుత్వం ఎలాంటి హామీలు ఇచ్చింది. పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న అంశాలను ఏపీఎన్ఆర్టీ కో-ఆర్డినేటర్ శ్రీకాంత్ కోడెబోయిన అందరికీ తెలిపారు. ఏపీఎన్ఆర్టీకి సౌత్ కరోలినా ప్రభుత్వం నుంచి వచ్చిన ఆహ్వానాన్ని ఆయన చూపించారు. ఏపీఎన్ఆర్టీ సభ్యులు లీలా భాస్కర్ ఈ సమావేశం జరిగేందుకు తన వంతుగా సహకరించారు. ఆయనేకాదు… ఏపీఎన్ఆర్టీ ఛీఫ్ కో-ఆర్డినేటర్ బుచ్చి రాం ప్రసాద్ సమావేశానికి హాజరైన పారిశ్రామిక వేత్తలకు అభినందనలు తెలిపారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.1 Comment

Leave a Reply

Your email address will not be published.


*