భాగ్యనగరంలో బిజీ బిజీగా ఇవాంకా…



Want create site? Find Free WordPress Themes and plugins.
         అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, సలహాదారు ఇవాంక ట్రంప్‌ భాగ్యనగరంలో అడుగు పెట్టారు. మాదాపూర్‌లోని ట్రైడెంట్‌ హోటల్‌కు చేరుకోక ముందు ఆమెకు శంషాబాద్‌ విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. వెస్టిన్‌ హోటల్‌లో బస చేస్తారని అనుకున్నా…ఆమె బసను ట్రైడెంట్‌కు మార్చారు. మధ్యాహ్నాం తర్వాత ఇవాంకా హెచ్‌ఐసీసీకి బయల్దేరనున్నారు. హెచ్ఐసీసీలోని రెండో అంతస్తులో కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో ఇవాంకా భేటీ కానున్నారు. మరోవైపు ఇవాంక రాక సందర్భంగా హైదరాబాద్ లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 
        నేడు మియాపూర్ లో మెట్రో రైలు ప్రారంభించిన తర్వాత ప్రధాని మోదీ హెలికాప్టర్ ద్వారా హెచ్ఐసీసీ వేదికకు చేరుకుంటారు. ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా ఇవాంకా కలుస్తారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ప్రారంభించిన తర్వాత.. పాతబస్తీలోని ఫలక్ నుమా ప్యాలెస్‌కు ప్రధాని మోదీ , ఇవాంకా వెళ్తారు. ఈ సదస్సుకు హాజరయ్యే సుమారు 1500 మంది ప్రతినిధులను 45 బస్సుల్లో ఫలక్ నుమా ప్యాలెస్ కు చేరుకుంటారు. ఫలక్ నుమా ప్యాలెస్ లో భారత సంస్కృతిని ప్రతిబింబించే ప్రదర్శన ఉంటుంది. అక్కడ విందు ముగిశాక ప్ర‌ధాని మోదీ దిల్లీకి ప‌య‌న‌మ‌వుతారు. ఆ తర్వాత ఇవాంకా తిరిగి రాత్రి 10.45గంట‌ల‌కు మాదాపూర్ లోని ట్రైడెంట్ హోటల్‌కు వెళ్తారు. ఈ నెల 29వ తేదీ ఉదయం ఇవాంక హెచ్ఐసీసీలోని సదస్సులో పాల్గొని ప్రసంగిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 12గంట‌ల తర్వాత హెచ్ఐసీసీ నుంచి ఇవాంక బయటకు వెళ్తారు. కానీ ఆమె ఎక్కడికి వెళ్తారనే విషయాన్ని భద్రత బలగాలు రహస్యంగా ఉంచాయి. 
         నగరంలో కీలక మైన ప్రాంతాలకు ఆమె వెళతారని తెలుస్తోంది. ఆ తర్వాత అమెరికా ప్రతినిధులతో భేటీ అయి రాత్రి 9.20 గంట‌ల‌కు శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ బ‌య‌ల్దేరి వెళ్తారు. ఇవాంకా హైదరాబాద్ రావడంతో పోలీసులు భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. ఆమె ప‌ర్య‌టించే ప్రాంతాల్లోను పూర్తిగా నిఘా పెట్టారు. సుమారు 150 దేశాల నుంచి 1500 మంది ప్ర‌తినిధులు ప్రపంచ పారిశ్రామికవేత్తల స‌ద‌స్సుకు విచ్చేశారు.   ప్ర‌పంచ పారిశ్రామికవేత్త‌ల స‌ద‌స్సును (జీఈఎస్‌) ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్రారంభించ‌నున్నారు. 
       ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు ఇవాంక ట్రంప్ ప్రత్యేక ఆకర్షణగా నిల‌వ‌నున్నారు. అమెరికా అధ్యక్షుడి సలహాదారు హోదాలో ఆ దేశ ప్ర‌తినిధుల బృందానికి ఆమె నేతృత్వం వహిస్తున్నారు. అమెరికా నుంచి వ‌చ్చిన ప్ర‌త్యేక వాహ‌నంలో ఆమె ప్ర‌యాణం చేస్తున్నారు. మరోవైపు అక్కినేని వారి కోడలు ప్రముఖ నటి  సమంత ఇవాంకాను కలిసి  గొల్లభామ చీరను బహుమతిగా ఇవ్వనున్నారట. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*