రేవంత్ రెడ్డికి డిసెంబర్ 9 డెడ్ లైన్



Want create site? Find Free WordPress Themes and plugins.
తెలంగాణ కాంగ్రెస్ నేత, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. ఆయన రాజీనామా ఆమోదం కాలేదు కాబట్టి అప్పటి వరకు అతను టీడీపీ ఎమ్మెల్యేనే. తనకు ఎమ్మెల్యే ద్వారా అందుతున్న సౌకర్యాలన్నింటినీ రద్దు చేయాలని స్పీకర్ మధుసూధనాచారికి రేవంత్ రెడ్డి తాజాగా లేఖ రాశారు. మరి రాజీనామా లేఖ ఎందుకు పంపలేదంటే మాత్రం సమాధానం లేదు. కాంగ్రెస్ హైకమాండ్ ఇందుకు ఇష్ట పడటం లేదని తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో అధికార పార్టీదే హవా అవుతోంది. కొడంగల్ లో ఉప ఎన్నిక వచ్చి ఓడిపోతే పార్టీ పై ప్రభావం పడుతుందని వద్దని వారిస్తుందట. అసలు ఈ విషయం పై బాహాటంగా మాట్లాడేందుకు రేవంత్ రెడ్డి తటపటాయిస్తున్నాడు. ఓటమి భయంతోనే రేవంత్ రెడ్డి వెనక్కు తగ్గుతున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఎవరు ఏమనుకున్నా… డిసెంబర్ 9 వరకు మాట్లాడేది లేదని చెబుతున్నారు రేవంత్ రెడ్డి. అప్పటికి రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికవుతారనే చర్చ సాగుతోంది. అందుకే వ్యూహాత్మకంగా కావాలని ఆగుతున్నట్లు సమాచారం. 
     తన రాజీనామా లేఖను తెలంగాణ స్పీకర్ కు పంపాలని రేవంత్ రెడ్డి అధికారికంగానే టీడీపీ అధినేత చంద్రబాబును అడగవచ్చు. ఒకవేళ ఆ పని చేయలేకపోతే మరో లేఖను స్పీకర్ కు పంపవచ్చు. ఓడిపోతాననే భయంతోనే రేవంత్.. రాజీనామాకు వెనకాడుతున్నారని శాసన మండలి చీఫ్ విప్.. టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. రేవంత్ రాజీనామాకు కాంగ్రెస్ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడం వల్లనే కాస్త ఆగుతున్నట్లు అనుచరులు చెబుతున్నారు. ఏదైనా రేవంత్ రెడ్డి వ్యవహారం పై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగక తప్పదు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*