గుంటూరులో పవన్ పార్టీ కార్యాలయం 



Want create site? Find Free WordPress Themes and plugins.
         ప్రముఖ నటుడు, జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ మరో పార్టీ కార్యాలయాన్ని అమరావతి కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద 3.42 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నారు. అక్కడే పార్టీ ఆఫీస్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే విజయవాడలో పార్టీ ఆఫీసు ఉంది. అది పార్టీ అవసరాలను తీర్చలేదు. అందుకే భూమి ని లీజుకు తీసుకుంటున్నారు. చినకాకాని వద్ద కార్యాలయం నిర్మించేందుకు జనసేన పార్టీ కోశాధికారి రాఘవయ్య భూమి హక్కుదారులతో ఒప్పందం చేసుకున్నారు. యార్లగడ్డ వెంకటేశ్వరరావు, సాంబశివరావు, అంకినీడు ప్రసాద్‌కు చెందిన 3.42ఎకరాల భూమిని మూడేళ్ల పాటు అద్దెకు తీసుకున్నారు. నెలకు ఎకరాకు రూ.50వేల చొప్పున అద్దె చెల్లించేందుకు వారు ఒప్పుకున్నారని తెలుస్తోంది. 
         అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ ఆఫీసు ఏర్పాటు చేసేందుకు జనసేన సిద్దమైంది. ముందుగా విజయవాడలో ఏర్పాటు చేయగా..ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండేలా చినకాకానిలో దాన్ని ఏర్పాటు చేయనున్నారు.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*