నవంబర్ 30న విడుదలకానున్న “ఆక్సిజన్”



Want create site? Find Free WordPress Themes and plugins.
గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం. జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “ఆక్సిజన్”. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తికాగా.. నవంబర్ 30న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. గోపీచంద్ సరసన రాశీఖన్నా, అను ఏమాన్యూల్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా ని ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వంలో రూపొందిన మూవీ ఆడియో త్వరలో విడుదలకానుంది. సినిమాని ముంబై, గోవా, సిక్కిం, చెన్నై లాంటి ప్రదేశాల్లో  రూపొందించారట. 
                        జగపతిబాబు, కిక్ శ్యామ్, అలీ, చంద్రమోహన్, నాగినీడు, బ్రహ్మాజీ, అభిమన్యు సింగ్, అమిత్, ప్రభాకర్, సాయాజీ షిండే, ఆశిష్ విద్యార్ధి, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, సితార తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి యాక్షన్ పీటర్ హైన్స్-స్టంట్ సిల్వ, కొరియోగ్రఫీ బృంద, సినిమాటోగ్రఫీ వెట్రి-ఛోటా కె.నాయుడు, ఎడిటింగ్ ఎస్.బి.ఉద్ధవ్, లిరిక్స్: శ్రీమణి-రామజోగయ్య శాస్త్రిలు అందించారు.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*