మెంటల్ మదిలో మూవీ సమీక్షWant create site? Find Free WordPress Themes and plugins.
రేటింగ్ : 2.75/5
న‌టీన‌టులు : శ్రీ‌విష్ణు, నివేదా పుతిరాజ్, అమృత శ్రీ‌నివాస‌న్, శివాజీరాజా, రేణు త‌దిత‌రులు
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు : వివేక్ ఆత్రేయ‌
నిర్మాత‌ : రాజ్ కందుకూరి
పరిచయ మాటలు…
పెళ్లిచూపులు లాంటి సినిమా త‌ర్వాత అదే కాంబినేష‌న్ లో వ‌చ్చిన చిత్రం మెంట‌ల్ మ‌దిలో. అదే త‌ర‌హాలో ప్రమోషన్ చేశారు నిర్మాత రాజ్ కందుకూరి. ఇటీవలనే నంది అవార్డును ఆ సినిమాకు అందుకున్న సంగతి తెలిసిందే. తాను ఇంత గొప్పగా సినిమా తీసిన తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదనే అసంతృప్తిని వ్యక్తం చేశాడాయన. ఏపీ ప్రభుత్వం ఆ కోరిక తీర్చింది. జాతీయ స్థాయిలోను గుర్తింపు వచ్చింది. అందుకే ఇప్పుడు మరింత శ్రద్ద పెట్టి మెంటల్ మదిలో తీశారు. ఎలా ఉందో ఏంటో ఒకసారి చూద్దాం…
క‌థ‌ లోకి వెళితే…
అర‌వింద్ కృష్ణ‌(శ్రీ‌విష్ణు) విచిత్రమైన మనిషి. తన జీవితానికి సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాల్లో అంతా గజిబిజీగా ఉంటాడు. అతనికి పెళ్లి చేయాల‌నుకుంటాడు తండ్రి (శివాజీరాజా). కానీ అర‌వింద్ తీరుతో వచ్చిన సంబంధాలన్నీ చెడిపోతుంటాయి. అలాంటి సమయంలో వచ్చింది  స్వేచ్చ‌(నివేదా పుతిరాజ్). పెళ్లిచూపుల‌కు వ‌చ్చిన అరవింద్ ఆమెకు న‌చ్చేశాడు. ఆ తర్వాత ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ‌తారు. ఇక పెళ్లి చేసుకోవడం మిగలింది. ఇలాంటి సమయంలోనే అర‌వింద్ ఆఫీస్ వ‌ర్క్ పై ముంబై వెళ్తాడు. అక్క‌డ రేణు(అమృత శ్రీ‌నివాస‌న్) అమ్మాయితో ప‌రిచ‌యం అవుతుంది. ఆమెతోను ప్రేమాయణం వెలగబెడతాడు హీరో. ఇటు స్వేచ్ఛ‌, అటు రేణుల్లో ఎవ‌రిని పెళ్లి చేసుకోవాలో తెలియ‌ని సందిగ్ధంలో పడతాడు అరవింద్. దీనికి ఎలాంటి ముగింపునిచ్చారనేదే కథ సారాంశం. 
కథ సాగిన తీరు…
చిన్న సినిమా. కానీ కాస్తంత కొత్త కోణంలోనే సాగింది. నవ్వుల‌ జల్లు కురిపించింది. మెంట‌ల్ మ‌దిలో తెలియ‌ని కథేం కాదు. కాకపోతే  సున్నితమైన హాస్యం, అంద‌మైన స‌న్నివేశాల‌ు ఆకట్టుకుంటాయి. క‌థను నడిపించిన తీరు ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ‌ ప్రతిభను చూపింది. పెళ్లిచూపులు నిర్మాతల నుంచి వ‌చ్చిన మ‌రో మంచి చిన్న సినిమా ఇది. క‌న్ఫ్యూజ‌న్ లో ఉన్న అబ్బాయి జీవితంలో జ‌రిగే స‌ర‌దా సంఘ‌ట‌న‌లే మెంట‌ల్ మ‌దిలో. ఫ‌స్టాఫ్ చాలా ఎంటర్ టైయినింగ్ గా సాగింది. కానీ సెకండాఫ్ కాస్త స్లో అయింది. చివరకు క్లైమాక్స్ లో క‌థ బాగుంది. మొత్తంగా చూడవచ్చు. కథ ముందే అర్థమవుతోంది. హీరోను కన్ ప్యూజన్ నుంచి మార్చేది హీరోయిన్ అనే క్లారిటీ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు. కామెడీతో పాటు.. చాలా సరదా సన్నివేశాలు ఉన్నాయి. సెకండాఫ్ లో దర్శకుడు కాస్తంత హీరో లా కన్ఫ్యూ జ్ అయ్యాడనిపిస్తోంది. 
నటనా ప్రతిభ….. 
అరవింద్ గా శ్రీ‌విష్ణు బాగానే నటించాడు. అమాయ‌కంగా ఉంటూనే ఆకట్టుకున్నాడు. ఫ్రెష్ లుక్ ఉంది. ఇక నివేదా పుతిరాజ్ నటన మంచి స్కోరు అయింది. అమృత శ్రీ‌నివాస‌న్ కారెక్ట‌ర్ కాస్త బోరుగా ఉంది. హీరో తండ్రిగా శివాజీరాజా బాగానే నటించాడు. ఇక అనితా చౌద‌రి, మ‌ధుమిత పాత్ర‌లు పర్వాలేదు. 
సాంకేతికంగా…
మెంట‌ల్ మ‌దిలో సినిమాకు సంగీతం అందించిన ప్ర‌శాంత్ ఆర్ విహార్ ను మెచ్చుకోవాలి. త‌న ఆర్ఆర్ తో చాలా సీన్స్ ను నిల‌బెట్టాడు ప్ర‌శాంత్. సినిమాటోగ్ర‌ఫీ, ఎడిటింగ్ బాగుంది. కాక‌పోతే సెకండాఫ్ లో కొన్నిచోట్ల ఎడిటింగ్ అంత గొప్పగా లేదు. ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ ఈ త‌రం అబ్బాయిల మెంటాలిటీ బాగా చూపించాడు. 
ప్లస్ పాయింట్స్ :
+ కథ
+ హీరో-హీరోయిన్స్ నటన
+ సంగీతం
మైనస్ పాయింట్స్ :
– సెకండ్ హాఫ్
– కొన్నిచోట్ల ఎడిటింగ్ 
చివరగా….
మెంట‌ల్ మ‌దిలో సినిమా ఒకసారి చూడొచ్చు..
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*