పెద్ద భూకంపం వస్తుందని ప్రచారం



Want create site? Find Free WordPress Themes and plugins.
ఉత్తరాఖండ్ లోని గర్వాల్ పర్వత శ్రేణులలో భారీగా భూకంపం వచ్చే ప్రమాదం ఉందట. ఈ మేరకు భూకంప అద్యయన కేంద్రం డైరెక్టర్ వినీత్ గెహ్లాట్ అధికారికంగానే మీడియాకు విషయం చెప్పారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, భూకంపాన్ని తట్టుకునే విధంగా ఇళ్ల నిర్మాణం ప్లానింగ్ జరగాలని ఆయన హెచ్చరించారు. ఉత్తరాఖండ్‌ కేంద్రంగా సంభవించే భూకంపం వల్ల నార్త్‌ ఇండియాలో ఉన్న పలు రాష్ట్రాల్లో కూడా తీవ్ర నష్టం కలుగుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా భూంకంపం రావచ్చని గెహ్లాట్ చెప్పారు. 
                     అక్కడే కాదు… హైదరాబాద్ లోను ఇటీవల కాలంలో తరచూ భూ ప్రకంపనలు వస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఇదే తీరు. ఫలితంగా రానున్న కాలంలో భారీ భూకంపం ఆ ప్రాంతాల్లో వచ్చే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. వాటి రాక వల్ల నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటోందని ముందే హెచ్చరించడం మాములు విషయం కాదు. 
                          ఈ మధ్యకాలంలో పకృతి విలయాలు ఎక్కువగా ఉంటాయని… ఆకాశం నుంచి వింత వస్తువులు ఊడి పడతాయనే ప్రచారం బాగానే సాగింది. ఇలా వస్తున్న పుకార్లతో ప్రజలు భయాందోళనలో గడుపుతున్నారు. స్కైలాబ్ లాంటి వస్తువు ఎప్పుడో భూమి మీద పడుతుందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చెప్పిన సంగతి తెలిసిందే. చైనా దేశం పంపిన శాటిలైట్ గతి తప్పి భూమి మీదకు వస్తుందని ఆ దేశ నిపుణులు ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*