టీడీపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు



Want create site? Find Free WordPress Themes and plugins.
         ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. కిషోర్‌కుమార్‌కు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పచ్చ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కిషోర్‌కుమార్‌ తనయుడు అమర్‌నాథ్‌రెడ్డి, జిల్లా నుంచి తన అనుచరులతో భారీగా తరలివచ్చారు. ఇటీవలనే సి.ఎం చంద్రబాబుతో మాట్లాడి వెళ్లిన కిషోర్ కుమార్ ఎట్టకేలకు తన భవిష్యత్ కార్యాచరణ పై నిర్ణయం తీసుకున్నాడు. మాజీ సి.ఎం కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడాకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
          ‘ప్రజలకు సేవ చేసినప్పుడు వారు చూపే ఆదరణ ఎంతో ముఖ్యం. నల్లారి అమర్‌నాథ్‌రెడ్డి నేను కలిసి పని చేశాం. కిషోర్‌కుమార్‌రెడ్డి రాజకీయ భవిష్యత్‌ నాకు తెలియనిది కాదు. చిత్తూరు రాజకీయాలు నాకు తెలియనివి కావు. హేతుబద్దత లేని విభజన జరుగుతుంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి కూడా గట్టిగా పోరాడారని చెప్పారు చంద్రబాబు. 
          జగన్‌, సోనియా కుమ్మక్కై విభజన చేస్తుంటే.. కిరణ్‌కుమార్‌రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పడం కాస్తంత ఆశ్చర్యంగానే ఉంది. పీలేరు అభివృద్ధి కోసం కిషోర్‌కుమార్‌రెడ్డి టీడీపీలో చేరారు. ఆయన చేరికతో ఇక పీలేరులో ఎన్నికలు ఏకపక్షం అవుతాయన్నారు. కుప్పంతో పోటీపడి పీలేరులో కూడా మంచి మెజారిటీ రావాలి. చిత్తూరు జిల్లాలో 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కుటుంబం నల్లారి కుటుంబం. నల్లారి కుటుంబం అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. వారి సేవలు పార్టీకి అవసరమన్నారు. అదే సమయంలో  కిషోర్‌కుమార్‌ను పీలేరు నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జిగా నియమిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. 
 
 
 
 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*