కిరణ్ కుమార్ రెడ్డి ఏ పార్టీలో చేరడట



Want create site? Find Free WordPress Themes and plugins.
       మాజీ సి.ఎం కిరణ్ కుమార్ రెడ్డి అస్త్ర సన్యాసం చేస్తారట. లగడపాటి రాజగోపాల్ పైకి చెప్పగా..కిరణ్ చెప్పకుండానే ఆ పని చేస్తున్నారు. ఏ పార్టీలోను చేరే ఆలోచన లేదట. అదే విషయాన్ని ఆయన అనుచరులకు చెప్పారని తెలుస్తోంది. ఇప్పుడున్న పార్టీల్లో దేన్ని నమ్మేలా లేదు. తన తమ్ముడు కిషోర్ కుమార్ టీడీపీలో చేరినా తాను అక్కడకు వెళ్లడం లేదని చెప్పారట. ఇదే విషయం నల్లారి కుటుంబంలో చర్చనీయాంశమైంది. టీడీపీలో చేరే విషయంలో కిరణ్ తన తమ్ముడికి ఎలాంటి ఆదేశాలు చేయలేదట. నీ ఇష్టం తొందరపడవద్దు. భవిష్యత్ ను ఆలోచించుకుని స్టెప్ప్ వేయమని చెప్పారట. తాను ముందుగా పార్టీలో చేరకపోతే మరొకరికి టీడీపీ సీటు ఇస్తుందనే ఆలోచనతోనే కిషోర్ తొందరపడ్డారని తెలుస్తోంది. అన్న కోసం ఇప్పటికే నాలుగేళ్లు ఆగాను. ఇక ఆగలేనని కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పి మరీ కిషోర్ కుమార్ టీడీపీలో చేరారట. 
         అదే విషయం ఇప్పుడు హాట్ టాపికైంది. తొలిగా కాంగ్రెస్ కు ఆ తర్వాత బీజేపీకి, చివరిగా టీడీపీలో కిరణ్ చేరుతున్నాడనే ప్రచారం చాలా సార్లు జరిగింది. కానీ ఎవరు ఎన్ని అనుకున్నా…2018 వరకు ఆయన ఎటు కదిలేది లేదట. జ్యోతిష్యులు ఆయనకు అదే మాట చెప్పారని తెలుస్తోంది. అందుకే వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారట. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*