చనిపోయాక జయ వేలిముద్రలను తీసుకున్నారా…!



Want create site? Find Free WordPress Themes and plugins.
జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందిన వైనం పై ఇప్పటికి ఎలాంటి ఫొటోలు, వీడియోలు బయటకు రాలేదు. కానీ ఇటీవల శశికళ ఇంట్లో దొరికిన పెన్ డ్రైవ్ లో కీలక సమాచారం లభించిందంటున్నారు. జయ ఆసుపత్రిలో ఉన్న వీడియోలు ఉన్నాయట. శశికళ ఆ వీడియోను చాలా భద్రంగా దాచి పెట్టారు. ఇంకోవైపు ఆమె మృతి పై నెలకున్న మిస్టరీ ఇంకా వీడలేదు. జయ చనిపోయాక ఒక రోజుకు గానీ ప్రకటించలేదు. ముందుగానే ఆమె చనిపోయారంటున్నారు. ఈ విషయంలో అపోలో ఆసుపత్రి యాజమాన్యం తప్పు చెబుతుందనే వాదనుంది. 
                తమిళనాడులో గతంలో జరిగిన ఉప ఎన్నికల సమయంలో మాజీ ముఖ్యమంత్రి జయలలిత వేలి ముద్రలను వాడుకున్నారని డీఎంకే చేస్తున్న ఆరోపణ. ఆమె చనిపోయాక వేలి ముద్రలను తీసుకున్నారనేది జరుగుతున్న ప్రచారం. ఈ మేరకు విచారణ కమిషన్ కు డీఎంకే వైద్య విభాగం కార్యదర్శి డాక్టర్ శరవణన్ కొన్ని సాక్ష్యాలు ఇచ్చారు. జ్వరం, డీహైడ్రేషన్‌తో బాధపడుతున్న జయను గత ఏడాది చెన్నై అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ఆ సమయంలోనే ఆమె ఆస్పత్రిలో ఉన్నప్పుడే తంజావూరు, తిరుప్పరగున్రం, అరవకురిచ్చి అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికలలో అన్నాడీఎంకే అభ్యర్దుల కోసం జయలలిత బీ ఫారాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ అప్పటికే జయ మరణించారని, అందుకే ఆమె వేలి ముద్రలు వాడుకున్నారని డీఎంకే చెబుతోంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలిసే అవకాశం లేదు. ఇప్పుడు అధికారంలో ఉంది ఏఐడీఎంకే ప్రభుత్వం. కాబట్టి వాస్తవాలు వెలుగులోకి వచ్చే వీలు లేదంటున్నారు.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*