బాలకృష్ణుడు మూవీ సమీక్షWant create site? Find Free WordPress Themes and plugins.
రేటింగ్ : 2.5/5
నటీనటులు : నారా రోహిత్‌, రెజీనా, రమ్యకృష్ణ, పృథ్వీ, ఆదిత్య మీనన్‌, కోట శ్రీనివాసరావు, అజయ్‌, వెన్నెల కిషోర్‌, రఘుబాబు,  శ్రీనివాస్‌రెడ్డి తదితరులు 
సంగీతం : మణిశర్మ 
నిర్మాత : బి.మహేంద్రబాబు, ముసునూరి వంశీ, శ్రీవినోద్‌ నందమూరి 
దర్శకుడు : పవన్ మల్లెల 
సంస్థ : మాయబజార్‌ మూవీస్‌, శరశ్చంద్రికా విజనరీ మోషన్‌ పిక్చర్స్‌ 
పరిచయ మాటలు…
నారా రోహిత్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు కుమారుడు. సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తు వస్తున్నాడు. బాణం సినిమాతో మొదలైన అతని ప్రయాణం సోలో, సావిత్రి, అసుర, రౌడీ ఫెలో, ప్రతినిధి, తుంటరి వంటి సినిమాలతో సాగుతోంది. శమంతకమణి, రాజా చెయ్యి వేస్తే వంటి సినిమాలతో కాస్తంత పేరు తెచ్చుకున్నాడు. ఏడాదికి మూడు, నాలుగు సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే 16 సినిమాలు విడుదల కాగా.. మరో రెండు విడుదలకు నోచుకోనున్నాయి. ఇలాంటి నేపధ్యంలో నారా రోహిత్ కథానాయకుడిగా వస్తున్న చిత్రం బాలకృష్ణుడు. దర్శకుడిగా పవన్ మల్లెలకు తొలి సినిమా. కథ పాతదే అయినా కొత్తదనం చూపించానని చెబుతున్నాడు. వాస్తవంగా ఈ సినిమా ఎలా ఉంది. ఏంటనేది చూద్దాం…
 
కథలోకి వెళితే…
కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలో ఫ్యాక్షన్ రాజకీయాలు రగులుతుంటాయి. 2006తో ఈ సినిమా కథ మొదలవుతుంది. రవీందర్ రెడ్డి (ఆదిత్య) అనే వ్యక్తి సీమ ప్రజలకు అండగా ఉంటూ వస్తున్నాడు. ఆయనకు ఒక సోదరి ఉంది. ఆమె పేరే భానుమతి దేవీ (రమ్యకృష్ణ). చెల్లెల ఇష్టాల ప్రకారమే ప్రజల బాగో కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేస్తుంచాడు ఆదిత్య. రోజు రోజుకు రవీందర్ రెడ్డికి ప్రజాదరణ పెరుగుతోంది. అదితట్టుకోలేక అతనికి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతాడు బసిరెడ్డి (మహదేవన్) అనే ప్రత్యర్థి. ఆ అవమాన భారం భరించలేక ఆత్మహత్య చేసుకుంటాడు. బసిరెడ్డి కొడుకు ప్రతాపరెడ్డి (అజయ్) పై అది ప్రభావం చూపిస్తోంది. ఎలాగైనా రవీందర్ రెడ్డిని హతమార్చాలనుకుంటాడు. అదే పని చేస్తాడు. 
                     అన్న చనిపోయినా ఆయన ఆశయాలు బతికించుకోవాలని ఆలోచిస్తోంది భానుమతి. రవీందర్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది.. ఫలితంగా ప్రతాపరెడ్డి జైలుకు వెళతాడు. అప్పటికే తన అన్నకూతురు ఆధ్య (రెజీనా)ను ఈ గొడవలకు దూరంగా పెంచుతోంది భానుమతి. పదకొండేళ్ల తరువాత ప్రతాపరెడ్డి జైలు నుంచి విడుదలవుతాడు. ముందస్తు జాగ్రత్తగా ఆధ్యని కాపాడేందుకు బాలు (నారా రోహిత్)ను బాడీ గార్డ్ గా ను నియమిస్తోంది భానుమతి. జైలు నుంచి వచ్చాక భానుమతితో పాటు.. రవీంద్రారెడ్డి కూతురు ఆధ్యను చంపేలాయనుకుంటాడు ప్రతాపరెడ్డి. ఈ కోణంలో బాలు అటు ఆధ్యను ఇటు భానుమతిని ఎలా కాపాడతాడు. విలన్ ను ఏం చేస్తాడు… బాలు, ఆధ్యల ప్రయాణం ఎలా సాగుతుందనేదే సినిమా కథ సారాంశం. 
కథనం తీరు…
పాత కథే. కాకపోతే కొత్తదనం చూపించేందుకు దర్శకుడు ప్రయత్నించాడు. ప్రతిభను కనబరిచాడు. హాస్య సన్నివేశాలు చూసి నవ్వు ఆపుకోలేము. అంతగా ఆకట్టుకుంటాయి. పృథ్వీ(30 ఇయర్స్‌ ఇండస్ట్రీ) వచ్చాక వినోదం పాళ్లు పెరుగుతాయి. నారా రోహిత్‌, పృథ్వీల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగున్నాయి. ముందుగానే కథ తెలుస్తోంది కాబట్టి కామెడీ కోసం చూడాల్సిందే. శ్రీనివాస్‌రెడ్డి బృందం చేసే నాటకం ఎపిసోడ్‌ కాస్తంత బోర్ కొట్టిస్తోంది. పతాక సన్నివేశాలు చాలా సాదా సీదాగా ఉన్నాయి. నారా రోహిత్‌ ఈ సినిమా కోసం బరువు తగ్గాడు. పర్వాలేదు. తెరపై బాగా కనిపించాడు. ఇంకాస్త తగ్గినా పర్వాలేదన్నట్టున్నాడు. రెజీనా అందంతో మరింతగా ఆకట్టుకుంది. బాహుబలిలో శివగామిగా నటించిన రమ్యకృష్ణ భానుమతి దేవిగాను చక్కగా నటించారు. అజయ్‌, పృథ్వీ నటన సినిమాకు ప్రధాన బలం. డిస్కవరీ ఫొటోగ్రాఫర్ మాధవరావు పాత్రలో పృథ్వీ మరోసారి రెచ్చిపోయాడు. అతని కామెడీ అద్భుతమైన టైమింగ్ తో అలరించింది. 
సాంకేతికంగా..
ఈ సినిమాకి సాంకేతికంగా మంచి మార్కులే వేయవచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి. విజయ్‌ సి.కుమార్‌ కెమెరా, మణిశర్మ సంగీతం, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్‌ బాగానే ఉన్నాయి. కథ, కథనం నడిపిన తీరు మరింతగా బావుంటే ఆకట్టుకునేది. 
ప్లస్ పాయింట్స్…
+ హీరో ఆహర్యం
+ పృథ్వీ నటన 
+ నిర్మాణ విలువలు
+ సంగీతం
మైనస్ పాయింట్స్…
–  పాత కథ 
– సెకండాఫ్ సాగదీత 
చివరగా…
పాత చింతకాయ పచ్చడి…
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*