పీకే సర్వేతో భయంకర నిజాలు



Want create site? Find Free WordPress Themes and plugins.
ప్రశాంత్ కిషోర్. పీకే ముద్దు పేరు. ఆయన తన టీమ్ తో విపరీతంగా సర్వేలు చేయిస్తున్నారు. ఖరగ్ పూర్ కు చెందిన మాజీ ఐఐటీ, ఐఐఎం విద్యార్థులు 50 మంది ఇందులో ఉన్నారు. వారు చేసే పని నిరంతరం సర్వే చేయడమే. ఎప్పటికప్పుడు సమాచారాన్ని పీకేకు అందించడం. ఎన్నికలు జరిగే వరకు వారి పని ఇదే. ఇందుకోసం కోట్ల రూపాయల ఖర్చు అవుతోంది. అయినా సరే వారు వెనక్కు తగ్గడం లేదు. వైకాపా అధ్యక్షుడు జగన్ వారికి కావాల్సిన అన్ని రకాల వసతి, సౌకర్యాలను సమకూరుస్తున్నారు.
                         నంద్యాల, కాకినాడ ఎన్నికలకు ముందు పీకే సర్వే ప్రకారం టీడీపీకి 45 శాతం మంది ఓటర్లుగా అండగా ఉండగా… వైకాపాకు-31 శాతం మంది మద్దతు పలికారు. జనసేనకు 7 శాతం మంది మాత్రమే మద్దతు పలకకా… బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, మిగతా వారు 17 శాతం ఓట్లను పంచుకుంటారని ఆ సర్వే చెప్పింది. ఫలితంగా టీడీపీ పోలవరం ప్రాజెక్టుతో పాటు.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ముమ్మరం చేసింది. చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళడం, పెట్టుబడుల వరద పారడం కలిసి వస్తోంది. రాజధాని నిర్మాణం విషయంలో మరింత వేగంగా పావులు కదపడం జరుగుతున్నాయి. ఫలితంగా ప్రజల నమ్మకం మరింతగా పెరిగింది.
                           తాజాగా పీకే టీమ్ నిర్వహించిన సర్వేలో ఆ వ్యత్యాసం కనపడిందట. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే టీడీపీకి-61 శాతం, వైకాపాకు 23 శాతం ఓట్లు వస్తాయని తేలిందట. గతంలో పోల్చుకుంటే వైకాపా గ్రాఫ్ గణనీయంగా తగ్గుతుందట. జగన్ పాదయాత్ర చేస్తున్నా పెద్దగా లాభం లేదంటున్నారు. ఇక జనసేనకు 11 శాతం ఓట్లు వస్తాయట. ఇతరులు కేవలం 5 శాతం ఓట్లే సంపాదిస్తారని తేలినట్లు తెలుస్తోంది.
                      ఇంకోవైపు టీడీపీలోని 45 మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని ప్రజలు భావిస్తున్నారు. అదే సమయంలో వైకాపాలో 23 మంది ఎమ్మెల్యేల పనితీరు పై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ఆ సర్వేలో తేలింది. కిరణ్ కుమార్ రెడ్డి వర్గం టీడీపీలో చేరడంతో మరింతగా ఆపార్టీ విజయావకాశాలు పెరిగాయని తెలుస్తోంది.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*