వర్మ గురించి అమెరికా నిఘా అధికారుల ఆరా



Want create site? Find Free WordPress Themes and plugins.
వార్తల్లో నిలవక పోతే వర్మకు నిద్రపట్టదు. అందుకే ఏదో ఒక కీలక అంశాన్ని ఎన్నుకుని కామెంట్ చేస్తాడు. చివరకు అది పెద్ద చర్చ జరిగి రచ్చ అయ్యేలా చూసుకుంటాడు. అదొక తృప్తి. నాగార్జునతో సినిమాతీస్తున్న వర్మ ఇప్పుడు బిజీగానే ఉంటున్నాడు. అంతటితో ఊరుకుంటే వర్మ ఎందుకు అవుతాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంకా హైదరాబాద్‌కి వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ఇందుకోసం కోట్ల రూపాయలను మంచినీళ్ల ప్రాయంలో ఖర్చు పెడుతోంది. తెలంగాణకు ఏమైనా పెట్టుబడులు వస్తాయానే భావనతోనే ఈ పని చేస్తుందామె. 
                           వివాదాస్పద డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మ చూపు ఇప్పుడు ఇవాంకా మీద పడింది. హైదరాబాద్ వేదికగా ఈనెల 28 నుంచి 30 వరకు జరగనున్న ఇంటర్నేషనల్ బిజినెస్‌ సదస్సుకు చీఫ్‌గెస్ట్‌గా ఇవాంక హాజరుకానుంది. దీంతో వర్మ తన మనసులోని భావాలను బయటపెట్టాడు. ‘తాను అందంగా ఉంటుందన్న పొగరు ఇవాంకాకు వుండొచ్చని… కానీ, సీఎం కేసీఆర్‌ అందాన్ని చూసి ఆమె షాక్‌ అవ్వడం ఖాయమని రాశాడు. కేసీఆర్- ఇవాంక పక్కపక్కన కూర్చుంటే.. ఇవాంకాని ఎవరూ చూడరని, ఎందుకంటే పక్కనే కేసీఆర్ ఉంటారని చమత్కరించాడు. ఇవాంకా ఇంటర్నేషనల్ ఫిగరని, ఆమెకి మూడు స్పెషల్ జ్యూరీ అవార్డులివ్వాలంటూ వరుసగా పోస్టులు పెట్టాడు.
                          దీంతో ఈ వర్మ ఎవరూ ఎందుకు ఇలా పోస్టులు చేస్తున్నాడంటూ అమెరికా నిఘా అధికారులు ఆరా తీయడం మొదలు పెట్టారు. మా అధ్యక్షురాలి కూతురుని ఫిగర్… అందం అంటూ కించపరిచేలా పోస్టులు చేస్తున్న వర్మ గురించి సమాచారం వైట్ హవుజ్ కు పంపించే పని చేస్తున్నారట. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*