వైభవంగా నమిత పెళ్లి



Want create site? Find Free WordPress Themes and plugins.
అందాల బొద్దు భామ నమిత పెళ్లి తిరుపతిలో ఘనంగా జరిగింది. తమిళ నటుడు వీరేంద్ర చౌదరితో నమిత వివాహం తిరుపతి ఇస్కాన్ టెంపుల్ లో జరిగింది. ఈ పెళ్లికి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వీరేంద్ర మోడల్.. నిర్మాత, వర్థమాన నటుడు. సినిమాలు నిర్మించే సమయంలో నమితతో జరిగిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లికి దారి తీసింది. నమిత తన 15వ ఏటనే 1998లో మిస్ సూరత్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2012లో శ్రీను వైట్ల రూపొందించిన సొంతం అనే చిత్రం ద్వారా తెలుగు చలన చిత్ర సీమలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత వెంకటేష్‌తో నటించిన జెమినీ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక బాలయ్య బాబు హీరోగా ఉన్న సింహాలో లెక్చరర్ గా నటించి మెప్పించింది నమిత. 
                          తెలుగు సినీమాల్లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు సొంతం, ఒక రాజు ఒక రాణి, ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి చిత్రాలలో నటించి ప్రేక్షకుల మన్ననల్ని పొందింది. ఆ తరువాత తమిళ, కన్నడ, హిందీ సినీరంగంలోకి ప్రవేశించింది. ‘జెమిని’, ‘జగన్మోహిని’, ‘బిల్లా’, ‘సింహా’ తదితర తెలుగు చిత్రాల్లోను ఆడి పాడింది. కమల్‌ హాసన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘బిగ్‌బాస్‌’ షోలోనూ పాల్గొని ఆకట్టుకుంది నమిత. బిగ్‌బాస్‌లో పాల్గొన్న తర్వాత నమిత మరింతగా ప్రాచుర్యం పొందింది. అనేక వివాదాలు చుట్టుముట్టినా ఆ కార్యక్రమంలో నమిత మెప్పించింది. మరోవైపు కోయంబత్తూరులో నమితకు గుడి కట్టించిన సంగతి తెలిసిందే. తమిళ హీరోయిన్లలో గుడికట్టించుకున్న వారిలో నమిత రెండోవారు. అంతకుముందు కుష్భూకు ఇలానే గుడికట్టిన సంగతి తెలిసిందే.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*