గులాబీ తోటలోకి ఉమా మాధవరెడ్డి 



Want create site? Find Free WordPress Themes and plugins.
          తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఉమా మాధవరెడ్డి. నల్గొండ జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కు. మొన్న జరిగిన టీడీపీ రైతు ఆందోళనలో ఆమె పాల్గొనలేదు. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడలేదు. పార్టీ నేతలు ఎల్. రమణ, మోత్కుపల్లి నరసింహులు తదితరులు వచ్చినా ఆమె ఆ సభకు రాలేదు. ఫలితంగా ఆమె పార్టీ మారుతున్నారనే వాదనకు బలం చేకూరింది. తనకు ఎలాంటి హామీ ఇవ్వకుండానే పార్టీ మారడానికి పిచ్చిదాన్ని కాదని ఇటీవలనే ఆమె వ్యాఖ్యానించింది. మరో నేతను వెంటబెట్టుకుని వెళ్లి మరీ సి.ఎం కేసీఆర్ ను కలిశారామె. 
         రేవంత్ రెడ్డి పార్టీ మారడంతో ఉమా మాధవరెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమయ్యారు. త్వరలోనే ఆమె నుంచి ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. అనుచరులు ఇప్పటికే పార్టీ మారేందుకు సిద్దమైనట్లు చెబుతున్నారు. అన్న ఎన్టీఆర్ హయం నుంచే మాధవరెడ్డి కుటుంబం టీడీపీకి అండగా ఉంటోంది. అందుకే ఆ కుటుంబానికి పలు కీలక పదవులను ఇచ్చారు. ఇప్పుడు ఇక తెలంగాణలో టీడీపీ పని అయిపోయిందనే ఆలోచనతో గులాబీ పార్టీ వైపు చూస్తోందామె. నల్గొండ జిల్లా రాజకీయాల్లో మోత్కుపల్లికి, ఉమా మాధవరెడ్డికి పొసగడం లేదు. అందుకే అసలు పార్టీని వీడటమే మంచిదనే ఆలోచనకు వచ్చారట. 
      ఇంకోవైపు ఉమామాధవరెడ్డితో మాట్లాడేందుకు కొందరు టీడీపీ సీనియర్లు ప్రయత్నిస్తున్నా అందుబాటులోకి రావడం లేదు. పార్టీ కార్యక్రమాల్లోను పాల్గొనడం లేదు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*