ఆ ఎంపీకి బెదిరింపు మెయిల్స్



Want create site? Find Free WordPress Themes and plugins.
       అరకు ఎంపీ కొత్తపల్లి గీత. ఆమెకు బెదిరింపు ఈ మెయిల్స్ వస్తున్నాయట. మీరు బంగారం కొన్నారని, అందుకు సంబంధించిన ఫైల్ ఏసిబి కార్యాలయంలో ఉంది. వివరాలు కావాలంటే ఫలానా ఎస్ బిఐ అకౌంట్ కు డబ్బులు పంపాలని ఎంపీ గీతకు మెయిల్ చేశారట ఎవరో వ్యక్తి. నాకే కాదు..చాలా మందికి ఇలానే బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయి. ఫేక్ కాల్స్, మెయిల్స్ వ్యవహారం పై బ్యాంకులు చర్యలు తీసుకోలేక పోతున్నాయి. అందుకే చట్టంలో మార్పు రావాలంటోంది గీత. అరకు ఎంపీ గీత కుమారుడు అకౌంట్ నుంచి రూ.12 వేలను ఎవరో తస్కరించారట. ఈ విషయం పై బ్యాంకు అధికారులకు చెప్పినా ఇంత వరకు చర్యలు తీసుకోలేదని ఆమె మండిపడుతోంది. ఆన్ లైన్ బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. దీని పై పార్లమెంటులో ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరముందని చెబుతోంది. 
        ఈ మేరకు విశాఖ ద్వారకా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు అరకు ఎంపీ. సైబర్ క్రైమ్ అంశాల పై కేంద్రం పూర్తిగా దృష్టి పెట్టాలని కోరారు గీత. అంతే కాదు..వారు సులువుగా తప్పించుకోవడానికి వీలు లేకుండా చర్యలు ఉండాలన్నారు.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*