రేవంత్‌కు దెబ్బే : ఆటలు సాగేలా లేవ్!



Want create site? Find Free WordPress Themes and plugins.

పార్టీకి భవిష్యత్తు లేదేమో అనే భయంతో రేవంత్ రెడ్డి.. తెలుగుదేశాన్ని వీడి కాంగ్రెస్ లోకి ఫిరాయించి ఉండవచ్చు గాక.. కానీ.. తాజా పరిణామాలను గమనిస్తోంటే.. తెదేపాలో చెలరేగిన స్థాయిలో ఆయన హవాలో కాంగ్రెస్ లో కూడా స్థిరంగా ఉంటుందా? లేదా, ఆ పార్టీలో ఇప్పటికే లెక్కకు మిక్కిలిగా ఉన్న సీనియర్ నాయకుల నడుమ.. గుంపులో గోవిందయ్య లాగా.. గుర్తింపుకు నోచుకోని బతుకు గడపాల్సిందేనా? అనే అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి. రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఆశలు పెట్టుకున్నదో.. అవేవీ పెద్దగా నెరవేరే అవకాశం ఇప్పుడు కనిపించడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా.. రేవంత్ ద్వారా తమకు లాభిస్తారని అనుకున్న నాయకులు గులాబీ వైపు మళ్లుతుండడం కాంగ్రెస్ కు ఎదురుదెబ్బే కావొచ్చు. ఇలాంటి నేపథ్యంలో.. రేవంత్ తాను ఆశించిన స్థాయిలో ఆ పార్టీలో ఆయనకు అగ్ర తాంబూలం దక్కుతుందా? అనేది అనుమానమే.

రేవంత్ రెడ్డి పార్టీ మారుతున్న సందర్భంలో అనేక పుకార్లు వచ్చాయి. ఆయన వెంట తెలుగుదేశం లోని అనేక మంది నాయకులు.. ప్రధానంగా తెదేపాలోని రెడ్డి వర్గం మొత్తం వెళ్లిపోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఉమా మాధవరెడ్డి, పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర రెడ్డి తదితరుల పేర్లు వినిపించాయి. కానీ అంతా ఉత్తుత్తిదే అని కాలక్రమంలో తేలుతోంది.

రేవంత్ వెంట అప్పట్లో కొందరు వెళ్లినది తప్ప.. కొత్తపేర్లు ప్రస్తుతం వినిపించడం లేదు. రావుల, పెద్దిరెడ్డిల ఊసే లేదు. తాజాగా ఉమా మాధవరెడ్డి కొడుకుతో కలిసి.. తెరాస తీర్థం పుచ్చుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇది కాంగ్రెస్ ఊహించని పరిణామం కావొచ్చు. మరి రేవంత్ ద్వారా వారు ఏం ఆశించారో ఆ స్థాయి ప్రయోజనం దక్కనప్పుడు, ఆయన హోదా పరంగా ఏం ఆశించాడో.. ఆ పదవులు మాత్రం దక్కుతాయా? లేదా? అనేది ఇప్పుడు మీమాంస. రేవంత్ రెడ్డి పార్టీలో చేరుతున్న సమయంలో తన వెంట ఎవరెవరిని తీసుకువస్తానని రాహుల్ కు మాట ఇచ్చారో.. తనకు ఏ పదవులు కావాలని డీల్ కుదుర్చుకున్నారో తెలియదు. కాకపోతే.. అనూహ్యమైన స్థాయిలో ఆయన వల్ల కాంగ్రెస్ కు ఒనగూరిన ప్రయోజనం కూడా లేదు. రేవంత్ డిసెంబరు 9న ముహూర్తం నిర్ణయించుకుని.. గాంధీభవన్ కు వెళుతున్నారు. మరి ముహూర్త బలం కలిసొస్తుందో లేదో!!

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*