సండ్ర పార్టీ మారతారా…



Want create site? Find Free WordPress Themes and plugins.
        తెలంగాణ టీడీపీలో మిగిలింది ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలే. ఒకరు ఆర్. కృష్ణయ్య కాగా..మరొకరు సండ్ర వెంకటవీరయ్య. వారిలో పార్టీలో కాస్తంత క్రియాశీలకంగా ఉంది సండ్ర ఒక్కరే. రేవంత్ రెడ్డి పార్టీ మారడంతో అంతా తానై నడిపిస్తున్నాడు. ఇప్పుడు సండ్ర వెంక‌ట వీర‌య్య పార్టీ వీడి గులాబీ తీర్థం తీసుకునేందుకు ముహూర్తం ఖ‌రారైంది. తెలంగాణ ప్ర‌క‌ట‌న చేసిన తేదీ అయిన డిసెంబ‌ర్ 9న సండ్ర త‌న అనుచ‌రులతో పాటుగా టీఆర్ఎస్ లో చేర‌నున్నారు. ఓటుకు నోటు కేసులో సండ్ర పై కేసు ఉంది. రేవంత్ కాంగ్రెస్ లో చేరే స‌మ‌యంలో తాను టీడీపీని వీడేది లేద‌ని సండ్ర చెప్పారు. అయితే, మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌తో టీఆర్ఎస్ లో చేరాల‌ని సండ్ర నిర్ణ‌యించుకున్నారు. అసెంబ్లీ స‌మావేశాల స‌మ‌యంలోనే ఈ మేరకు సండ్రతో అధికార పార్టీ నేతలు జ‌రిపిన మంత్రాంగం ఫ‌లించింది. 
        న‌ల్గొండ కు చెందిన టీడీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు ఉమా మాధ‌వ రెడ్డి సైతం అదే  రోజు టీఆర్ఎస్ లో చేర‌నున్నట్లు స‌మాచారం. రెండు రోజుల క్రితం ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను క‌లిసిన ఉమా మాధ‌వె రెడ్డి..తన‌కు ఎటువంటి ఆఫ‌ర్ లేకుండా పార్టీ మార‌న‌ని స్ప‌ష్టం చేసారు. అయితే, పార్టీ మార‌టానికి సిద్దంగా ఉన్న‌ట్లు మాత్రం సంకేతాలు ఇచ్చారు. ఇక‌, సండ్ర వెంక‌ట వీర‌య్య‌, ఉమా మాధ‌వ‌రెడ్డి డిసెంబ‌ర్ 9న పార్టీ మారడం ఖాయమనే చర్చ సాగుతోంది. టీఆర్ఎస్ వ‌ర్గాలు ఇదే మాట చెబుతున్నాయి.
        వారితోపాటు మరికొందరు కీలక నేతలను పార్టీలో చేర్చుకునేందుకు కేసీఆర్ తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*