జేడీ లక్ష్మీనారాయణ ఇంట్లో చోరీ



Want create site? Find Free WordPress Themes and plugins.
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి లక్ష్మీనారాయణ ఇంటిలో చోరి జరిగింది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలోని సంస్కృతి అపార్టుమెంట్ లో ఆయన ఇంటి లో ఈ చోరి జరిగింది. ఒక ఫంక్షన్ కు వెళ్లి వచ్చి బంగారు ఆభరణాలను ఇంట్లోని మంచం మీద పెట్టారు లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ. ఆ తర్వాత వాటి సంగతి మర్చి పోయారు. ఇంటిలో పనిచేసే వారు ఈ ఆభరణాలను తీసుకెళ్లారు. వాటి విలువ సుమారు రూ.10 లక్షల వరకు ఉంటోంది. ఇప్పటికే కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. 
               గతంలో పని చేసే వారు ఊరెళ్లడంతో ఇటీవలనే దుర్గ అనే మహిళను పనికి పెట్టుకున్నారు. ఆమె ఈ పని చేసి ఉంటుందని అనుమానిస్తున్నారు. మొత్తం 30 తులాల ఆభరణాలు ఉన్నాయి. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*