శిల్పాకు గన్ మెన్లు కట్



Want create site? Find Free WordPress Themes and plugins.
నంద్యాల ఉప ఎన్నికల ఓటమి దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదు మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి. ఆ మధ్య తిరిగి టీడీపీలోకి చేరేందుకు ఆయన ప్రయత్నించాడని తెలిసింది. కానీ సి.ఎం చంద్రబాబు ఇందుకు ఒప్పుకోలేదంటున్నారు. కానీ ఇప్పుడు శిల్పా మోహన్ రెడ్డి తిరిగి హాట్ టాపికయ్యారు. తొలి అస్త్రం ఇప్పుడు శిల్పా పై ప్రయోగించింది టీడీపీ సర్కారు. శిల్పా మోహన్ రెడ్డి గన్ మెన్లను తొలగించారు. శిల్పాతో పాటుగా నంద్యాల మున్సిపల్ చైర్మన్.. దేశం సులోచనకు గన్ మెన్లు లేరు ఇప్పుడు. టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని శిల్పా చక్రపాణిరెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. 
                      జగన్ ‘ప్రజా సంకల్ప యాత్ర’ కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న సమయంలో శిల్పా మోహన్ రెడ్డి గన్ మెన్లను తొలగించడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సి.ఎం చంద్రబాబు సర్కారుకు ఇది తగదనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పోటీ చేసినంత మాత్రాన అలా గన్ మెన్లను ఏకపక్షంగా తొలగించడంపై దుమారం రేగుతోంది. గతంలో ఇలానే చెరుకులపాటి నారాయణరెడ్డికి గన్ మెన్లను తొలిగించింది. చివరకు ఆయన్ను ప్రత్యర్థులు మట్టు పెట్టారు. ఇప్పుడు అదే తప్పు చేస్తోంది టీడీపీ ప్రభుత్వం. 
                        ఇదే విషయంపై కర్నూలు జిల్లాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రభుత్వ నిర్ణయం పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యగా అందరూ దుమ్మెత్తి పోస్తున్నారు. నిజానికి ఫ్యాక్షన్ జిల్లా అయిన కర్నూలులో శిల్పా వంటి కీలక నేతలకు గన్ మెన్లు అవసరం. ఆ సంగతి ప్రభుత్వానికి బాగానే తెలుసు. తాను పార్టీ మారడమే కారణమని శిల్పా.. చంద్రబాబుపై విమర్శలు సంధించారు. ఇలాంటి పరిణామాలు రాజకీయాల్లో మంచిది కాదు… న్యాయస్థానాల్లో సవాల్ చేస్తామని శిల్పా వర్గీయులు చెబుతున్నారు.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*